కంటెంట్‌కు వెళ్లండి

Tribute గురించి బైబిల్ వచనాలు: Sometimes exacted by kings from their own subjects

8 వచనాలు · 24 కోణాలు

Sometimes exacted by kings from their own subjects గురించి వచనాలు

  1. తమకు రాజు కావాలని అడిగిన ప్రజలందరికి సమూయేలు యెహోవా మాటలన్నిటిని చెప్పాడు.

  2. అతడు వారితో, “మిమ్మల్ని పరిపాలించబోయే రాజు హక్కులు ఇవే: అతడు మీ కుమారులను తీసుకెళ్లి తన రథాలను గుర్రాలను చూసుకోవడానికి వారిని నియమిస్తాడు. వారు అతని రథాల ముందు పరుగెత్తుతారు.

  3. కొందరిని తన సైన్యంలో వేయిమందిపై సహస్రాధిపతులుగా, యాభైమందిపై పంచదశాధిపతులుగా నియమిస్తాడు. మరికొందరిని తన భూమిని దున్నడానికి, తన పంటలు కోయడానికి, యుద్ధానికి ఆయుధాలను, తన రథాలకు పరికరాలను తయారుచేయడానికి నియమిస్తాడు.

  4. మీ ఆడపిల్లలను పరిమళద్రవ్యాలు తయారుచేయడానికి వంటచేయడానికి రొట్టెలు కాల్చడానికి నియమిస్తాడు.

  5. అతడు మీ ద్రాక్షతోటల నుండి ఒలీవతోటల నుండి శ్రేష్ఠమైన వాటిని తీసుకుని తన సహాయకులకు ఇస్తాడు.

  6. మీ ధాన్యంలో ద్రాక్షపండ్లలో పదవ భాగాన్ని తీసుకుని తన అధికారులకు సహాయకులకు ఇస్తాడు.

  7. మీ సేవకులను సేవకురాళ్లను మీ పశువుల్లో గాడిదలలో శ్రేష్ఠమైన వాటిని తన కోసం వాడుకుంటాడు.

  8. మీ గొర్రెల మందలలో పదవ భాగాన్ని తీసుకుంటాడు, అంతేకాదు స్వయంగా మీరే అతనికి బానిసలవుతారు.