Skip to content

Tree గురించి బైబిల్ వచనాలు

17 వచనాలు · 4 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. యెహోవా దేవుడు నేల నుండి కంటికి అందంగా కనిపించే ఆహారానికి సరియైన అన్ని రకాల చెట్లను మొలిపించారు. అలాగే ఆ తోట మధ్యలో జీవవృక్షం, మంచి చెడ్డల తెలివినిచ్చే జ్ఞాన వృక్షం ఉన్నాయి.

  2. కానీ మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలం మాత్రం తినకూడదు. అది తిన్న రోజున నీవు తప్పక చస్తావు” అని ఆజ్ఞాపించారు.

  3. కాని, ‘తోట మధ్యలో చెట్టు పండు మాత్రం తినకూడదు, దానిని ముట్టుకోవద్దు, లేదంటే మీరు చస్తారు’ అని దేవుడు చెప్పారు” అని జవాబిచ్చింది.

  4. అప్పుడు సర్పం, “మీరు ఖచ్చితంగా చావరు.

  5. మీరు అది తింటే మీ కళ్లు తెరవబడతాయని, మీరు దేవునిలా అవుతారని, మంచిచెడులు తెలుసుకుంటారని దేవునికి తెలుసు” అని చెప్పింది.

  6. స్త్రీ ఆ చెట్టు పండు తినడానికి మంచిది, చూడటానికి బాగుంది, తింటే జ్ఞానం వస్తుందని తలంచి, దానిలో కొంచెం తిని, తన భర్తకు కూడా ఇచ్చింది, అతడు కూడా తిన్నాడు.

  7. అప్పుడు దేవుడు, “నీవు నగ్నంగా ఉన్నావని నీకెవరు చెప్పారు? తినకూడదని నేను మీకు ఆజ్ఞాపించిన ఆ చెట్టు నుండి పండు తిన్నావా?” అని అడిగారు.

  8. అందుకు ఆదాము, “మీరు నాకిచ్చిన ఈ స్త్రీ ఆ చెట్టు పండును కొంచెం నాకిచ్చింది, నేను తిన్నాను” అని చెప్పాడు.

  9. ఆదాముతో ఆయన ఇలా అన్నారు, “నీవు నీ భార్య మాట విని, ‘తినవద్దు’ అని నేను నీకు చెప్పిన ఆ చెట్టు పండును నీవు తిన్నావు కాబట్టి, “నిన్ను బట్టి ఈ నేల శపించబడింది; నీ జీవితకాలమంతా దాని పంట నుండి, కష్టపడి పని చేసి తింటావు.

  10. అప్పుడు యెహోవా దేవుడు, “మనుష్యుడు ఇప్పుడు మంచి చెడ్డలు తెలుసుకోగలిగి మనలాంటి వాడయ్యాడు, కాబట్టి అతడు తన చేయి చాపి జీవవృక్ష ఫలం కూడా తెంపుకొని తిని ఎప్పటికీ బ్రతికే ఉంటాడేమో, అలా జరగనివ్వకూడదు” అని అనుకున్నారు.

  11. దేవుడు ఆదామును బయటకు పంపివేసి జీవవృక్షం దగ్గరకు వెళ్లే మార్గాన్ని కాపాడడానికి ఏదెను తోటకు తూర్పున కెరూబును ఇటు అటు తిరుగుతున్న మండుతున్న ఖడ్గాన్ని కాపలా ఉంచారు.

  12. వారు నీటికాలువల ప్రక్కన నాటబడి, ఆకులు వాడిపోకుండ, సరియైన కాలంలో ఫలమిచ్చే చెట్టులా ఉంటారు వారు చేసేవాటన్నిటిలో వృద్ధిచెందుతారు.

  13. వారు నీళ్ల ప్రక్కన నాటిన చెట్టులా ఉంటారు వాటి వేర్లు నీటి ప్రక్కన లోతుగా పాదుకుంటాయి. కాబట్టి వేడి తగిలినా అవి భయపడవు; వాటి ఆకులు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి. కరువు వచ్చిన సంవత్సరంలో వాటికి చింత ఉండదు, ఫలాలు ఇచ్చే విషయంలో ఎప్పుడూ విఫలం కావు.”

  14. నా పడకలో నేను పడుకుని ఉన్నప్పుడు నేను చూసిన దర్శనాలు ఇవి: నేను చూడగా, భూమి మధ్యలో ఒక చెట్టు కనిపించింది, దాని ఎత్తు చాలా ఎక్కువ.

  15. ఆ చెట్టు ఎత్తుగా, బలంగా పెరిగింది. దాని కొమ్మ ఆకాశాన్ని అంటుకుంది; భూమి అంచుల వరకు అది కనిపించింది.

  16. దానికి అందమైన ఆకులు సమృద్ధిగా ఫలాలు ఉన్నాయి. అందరికి సరిపడా ఆహారం దాని మీద ఉంది. అడవి జంతువులు దాని నీడలో ఉన్నాయి, పక్షులు దాని కొమ్మల్లో నివసించాయి; ప్రతి జీవి దాని నుండి పోషించబడింది.

  17. “జీవ వృక్షానికి హక్కు పొంది, ద్వారాల గుండా పట్టణంలోనికి ప్రవేశించేలా తమ వస్త్రాలను ఉతుక్కున్నవారు ధన్యులు.