కంటెంట్‌కు వెళ్లండి

The Tribe Of Manasseh గురించి బైబిల్ వచనాలు: Predictions respecting

10 వచనాలు · 30 కోణాలు

Predictions respecting గురించి వచనాలు

  1. “యోసేపు ఫలించే కొమ్మ, నీటిబుగ్గ దగ్గర ఫలించే కొమ్మ దాని తీగెలు గోడ మీదికి ఎక్కి ప్రాకుతాయి.

  2. అసూయతో విలుకాండ్రు అతనిపై దాడి చేశారు; అతనిపై బాణాలు విసిరారు.

  3. కానీ అతని విల్లు స్థిరంగా నిలిచింది, అతని చేతులు బలంగా ఉన్నాయి, ఎందుకంటే యాకోబు యొక్క బలవంతుని హస్తాన్ని బట్టి, కాపరి, ఇశ్రాయేలు యొక్క బండను బట్టి,

  4. నీకు సహాయం చేసే నీ తండ్రి యొక్క దేవున్ని బట్టి, పైనున్న ఆకాశాల దీవెనలతో, క్రింది అగాధజలాల దీవెనలతో, స్తనాల దీవెనలతో గర్భం యొక్క దీవెనలతో, నిన్ను ఆశీర్వదించే సర్వశక్తిమంతున్ని బట్టి బలపరచబడ్డాయి.

  5. నీ తండ్రి ఆశీర్వాదాలు పురాతన పర్వత ఆశీర్వాదాల కంటే, ప్రాచీన కొండల యొక్క కోరదగిన వాటికంటే గొప్పవి. ఇవన్నీ యోసేపు తలమీద, తన సోదరులలో అధికారిగా ఉన్న వాడిపై ఉండాలి.

  6. యోసేపు గురించి అతడు ఇలా అన్నాడు: “యెహోవా అతని భూమిని ఆకాశం నుండి కురిసే శ్రేష్ఠమైన మంచుతో క్రింద ఉన్న లోతైన జలాలతో దీవించును గాక;

  7. సూర్యుని వలన కలిగే ఉత్తమమైన ఫలాలతో చంద్రుడు ఫలింపచేసే శ్రేష్ఠమైన ఫలాలతో;

  8. పురాతన పర్వతాల శ్రేష్ఠమైన వాటితో శాశ్వత కొండల శ్రేష్ఠమైన పంటతో;

  9. భూమి ఇచ్చే ప్రశస్తమైన పదార్థాలతో వాటి సమృద్ధితో మండుతున్న పొదలో నివసించే ఆయన దయతో దీవించును గాక. ఇవన్నీ యోసేపు తలపై ఉండును గాక, అతని సోదరుల మధ్యలో యువరాజు నుదుటి మీద ఉండును గాక.

  10. ప్రభావంలో అతడు మొదట పుట్టిన కోడెలాంటి వాడు; అతని కొమ్ములు అడవి ఎద్దు కొమ్ములు. వాటితో అతడు జనులను, భూమి అంచులో ఉన్నవారిని కూడా కుమ్ముతాడు. ఎఫ్రాయిముకు చెందిన పదివేలమంది అలాంటివారు, మనష్షేకు చెందిన వేలమంది అలాంటివారు.”