The Tribe Of Issachar గురించి బైబిల్ వచనాలు: Bounds of their inheritance
Bounds of their inheritance గురించి వచనాలు
నాల్గవ చీటి వారి వంశాల ప్రకారం ఇశ్శాఖారుకు వచ్చింది.
వారి భూభాగంలో ఇవి ఉన్నాయి: యెజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము
హపరాయిము, షీయోను, అనహరాతు,
రబ్బీతు, కిష్యోను, ఎబెస్
రెమెతు, ఎన్-గన్నీము, ఎన్-హద్దా, బేత్-పస్సెసు ఉన్నాయి.
దాని సరిహద్దు తాబోరు, షహజుమా, బేత్-షెమెషులను తాకి యొర్దాను నది దగ్గర ముగిసింది. పదహారు పట్టణాలు, వాటి గ్రామాలు ఉన్నాయి.
ఈ పట్టణాలు, వాటి గ్రామాలు ఇశ్శాఖారు గోత్రానికి వారి వంశాల ప్రకారం వారసత్వంగా ఉన్నాయి.