కంటెంట్‌కు వెళ్లండి

The Law of Moses గురించి బైబిల్ వచనాలు

65 వచనాలు · 73 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న మంచి విషయాల యొక్క ప్రధాన యాజకునిగా క్రీస్తు వచ్చినప్పుడు, మానవుల చేతితో చేయబడని గొప్పదైన పరిపూర్ణమైన గుడారం గుండా ఆయన వెళ్లాడు, అంటే అది ఈ సృష్టిలో ఒక భాగం కాదు.

  2. ఆయన మేకల దూడల రక్తాన్ని తీసుకుని ప్రవేశించలేదు; కాని శాశ్వత విమోచన సంపాదించడానికి స్వరక్తంతో అతి పరిశుద్ధ స్థలంలోకి ఆయన ఒక్కసారే ప్రవేశించాడు.

  3. ఆచారపరంగా అపవిత్రులైనవారు బాహ్యంగా పవిత్రులయ్యేలా మేకల ఎడ్ల రక్తంను దహించబడిన దూడ బూడిదను వారిపై చల్లి వారిని పవిత్రులుగా చేస్తాడు.

  4. నిత్యమైన ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొన్న క్రీస్తు రక్తం, మనం జీవంగల దేవుని సేవించేలా, మరణానికి నడిపించే వ్యర్థమైన క్రియల నుండి మన మనస్సాక్షిని ఇంకెంత ఎక్కువగా పవిత్రపరుస్తుంది!

  5. ప్రతిదినం ప్రతి యాజకుడు నిలబడి మతపరమైన విధులు నిర్వర్తిస్తాడు; పాపాలను ఎన్నటికిని తీసివేయలేని అదే బలులను పదే పదే అర్పిస్తాడు.

  6. అయితే ఈ యాజకుడు పాపాల కోసం అన్ని కాలాలకు ఒకే ఒక బలిని అర్పించి, దేవుని కుడి ప్రక్కన కూర్చున్నాడు,

  7. ఆ సమయం నుండి తన శత్రువులు తన పాదపీఠంగా చేయబడేవరకు ఆయన అక్కడ వేచి ఉంటాడు.

  8. పరిశుద్ధులుగా చేయబడిన వారిని, ఒకే ఒక బలి ద్వారా ఆయన శాశ్వతంగా పరిపూర్ణులను చేశాడు.

  9. తాకగల పర్వతం దగ్గరకు మీరు రాలేదు అది అగ్నితో మండుతుంది; చీకటి, కారు మబ్బు, తుఫాను;

  10. ఒక బూర శబ్దం లేదా అలాంటి గంభీరస్వరంతో మాట్లాడే చోటుకు మీరు రాలేదు. ఆ స్వరం యొక్క మాటలు విన్న వారు తమతో ఇంకొక్క మాట మాట్లాడకూడదని బ్రతిమాలుకొన్నారు,

  11. “ఒకవేళ ఒక జంతువైనా ఆ పర్వతాన్ని తాకితే, రాళ్లతో కొట్టబడి చంపబడాలి” అని ఇవ్వబడిన ఆజ్ఞను వారు భరించలేకపోయారు.

  12. ఆ దృశ్యం చాలా భయానకం కాబట్టి మోషే, “నేను భయంతో వణుకుతున్నాను” అన్నాడు.

  13. అయితే మీరు సీయోను పర్వతానికి, సజీవ దేవుని పట్టణమైన పరలోకపు యెరూషలేముకు వచ్చారు. మీరు సంతోషకరమైన సభలో వేలాదిమంది దేవదూతల దగ్గరకు వచ్చారు.

  14. పరలోకంలో పేర్లు వ్రాయబడి ఉన్న దేవుని జ్యేష్ఠ సంతానమనే సంఘానికి మీరు వచ్చారు. మనుష్యులందరికి న్యాయాధిపతియైన దేవుని దగ్గరకు, నిర్దోషులుగా తీర్చబడిన నీతిమంతుల్లా పరిపూర్ణత పొందిన ఆత్మల దగ్గరకు మీరు వచ్చారు.

  15. క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైన యేసు దగ్గరకు, హేబెలు రక్తంకంటే ఉత్తమంగా మాట్లాడే చిందించబడిన రక్తం దగ్గరకు మీరు వచ్చారు.