కంటెంట్‌కు వెళ్లండి

The Law of Moses గురించి బైబిల్ వచనాలు: Terror of Israel at receiving

6 వచనాలు · 73 కోణాలు

"The Law of Moses" కోసం వెతకండి

Terror of Israel at receiving గురించి వచనాలు

  1. ప్రజలు ఆ ఉరుములు మెరుపులు చూసి బూరధ్వని విని పర్వతం నుండి వస్తున్న పొగను చూసి, వారు భయంతో వణికారు. వారు దూరంగా నిలబడి

  2. మోషేతో, “నీవు మాతో మాట్లాడు మేము వింటాము. మాతో దేవుడు నేరుగా మాట్లాడవద్దు లేదా మేము చనిపోతాం” అన్నారు.

  3. అందుకు మోషే ప్రజలతో, “భయపడకండి. మిమ్మల్ని పరీక్షించడానికి దేవుడు వచ్చారు, తద్వార మీరు పాపం చేయకుండా దేవుని భయం మీలో ఉంటుంది” అని చెప్పాడు.

  4. ఆ పర్వతం అగ్నితో మండుతున్నప్పుడు, ఆ చీకటిలో నుండి స్వరాన్ని మీరు విన్నప్పుడు, మీ గోత్రాల నాయకులందరు, మీ పెద్దలు నా దగ్గరకు వచ్చారు.

  5. మీరు నాతో అన్నారు, “మన దేవుడైన యెహోవా తన మహిమను తన ఘనతను మాకు చూపించారు, అగ్నిలో నుండి ఆయన స్వరాన్ని మేము విన్నాము. దేవుడు మనుష్యులతో మాట్లాడినా వారు బ్రతికే ఉంటారని ఈ రోజు మేము చూశాము.

  6. అయితే ఇప్పుడు మేమెందుకు చావాలి? ఈ గొప్ప అగ్ని మమ్మల్ని కాల్చివేస్తుంది, మేము మన దేవుడైన యెహోవా స్వరాన్ని ఇంకా వింటే చనిపోతాము.