The, is God Holy Spirit గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
మీ ఆత్మ నుండి నేను ఎక్కడికి వెళ్లగలను? మీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోగలను?
ఒకవేళ నేను ఆకాశానికి ఎక్కి వెళ్తే, అక్కడా మీరు ఉన్నారు; నేను పాతాళంలో నా పడకను సిద్ధం చేసుకుంటే, అక్కడా మీరు ఉన్నారు.
ఒకవేళ నేను ఉదయపు రెక్కలపై ఎగిరిపోయి, నేను సముద్రం యొక్క సుదూరాన స్థిరపడితే,
అక్కడ కూడా మీ చేయి నన్ను నడిపిస్తుంది, మీ కుడిచేయి నన్ను గట్టిగా పట్టుకుంటుంది.
“చీకటి నన్ను దాచివేస్తుంది, నా చుట్టూ ఉన్న వెలుగు రాత్రిగా మారుతుంది” అని నేననుకుంటే,
చీకటి కూడ మీకు చీకటి కాదు; రాత్రి పగటివలె మెరుస్తుంది, ఎందుకంటే చీకటి మీకు వెలుగు లాంటిది.
నా అంతరంగాన్ని మీరు సృష్టించారు; నా తల్లి గర్భంలో మీరు నన్ను ఒక్కటిగా అల్లారు.
అప్పుడు ప్రభువు స్వరం, “నేను ఎవరిని పంపాలి? మాకోసం ఎవరు వెళ్తారు?” అని అనడం నేను విన్నాను. నేను, “నేనున్నాను. నన్ను పంపండి!” అన్నాను.
అందుకు ఆయన, “నీవు వెళ్లి ఈ ప్రజలతో ఇలా చెప్పు: “ ‘మీరు ఎప్పుడు వింటూనే ఉంటారు, కాని అర్థం చేసుకోరు; ఎప్పుడు చూస్తూనే ఉంటారు, కాని గ్రహించరు.’
వారి హృదయాలను కఠినపరచు; వారి చెవులకు చెవుడు వారి కళ్లకు గుడ్డితనం కలిగించు లేదంటే వారు తమ కళ్లతో చూసి, చెవులతో విని, హృదయాలతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందుతారు.”
అతడు ప్రభువుని అభిషిక్తుని అనగా క్రీస్తును చూడకుండ చనిపోడని పరిశుద్ధాత్మ ద్వార బయలుపరచబడింది.
అతడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, దేవాలయ ఆవరణంలోనికి వెళ్లాడు. ధర్మశాస్త్ర ఆచార ప్రకారం శిశువైన యేసుకు జరిగించడానికి ఆయన తల్లిదండ్రులు ఆయనను లోపలికి తీసుకువచ్చినప్పుడు,
సుమెయోను ఆ శిశువుని తన చేతుల్లోకి తీసుకుని దేవుని స్తుతిస్తూ, ఇలా అన్నాడు:
“సర్వశక్తిగల ప్రభువా, నీ మాట ప్రకారం, ఇప్పుడు సమాధానంతో నీ దాసుని వెళ్లనివ్వు.
ఆయన వచ్చినప్పుడు, పాపం గురించి నీతిని గురించి తీర్పును గురించి లోకస్తులను తప్పు ఒప్పుకునేలా చేస్తాడు.
ప్రజలు నన్ను నమ్మలేదు కాబట్టి వారి పాపం గురించి, నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను కాబట్టి ఇక మీరు నన్ను చూడరు కాబట్టి వారి నీతిని గురించి,
Of righteousness, because I go to my Father, and ye see me no more;
ఈ లోకాధికారి ఇప్పుడు తీర్పుపొందినవానిగా ఉన్నాడు కాబట్టి తీర్పు గురించి ఒప్పింపజేస్తాడు.
పేతురు యోహానులు విడుదల పొందిన తర్వాత, వారి సహవిశ్వాసుల దగ్గరకు వెళ్లి ముఖ్య యాజకులు యూదా పెద్దలు తమతో చెప్పిన వాటన్నింటి గురించి వారికి చెప్పారు.
అది విన్న వెంటనే, వారందరు ఏకమనస్సుతో బిగ్గరగా దేవునికి ఈ విధంగా ప్రార్థించారు, “సర్వాధికారియైన ప్రభువా, మీరు ఆకాశాలను, భూమిని సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించారు.
చాలా కాలం ముందే మీ సేవకుడు, మా పితరుడైన దావీదు ద్వారా పరిశుద్ధాత్మ పలికించిన మాటలు: “ ‘దేశాలు ఎందుకు కోపంతో ఉన్నాయి ప్రజలు ఎందుకు వ్యర్థంగా పన్నాగం వేస్తున్నారు?
కాబట్టి, పరిశుద్ధాత్మ చెప్పినట్లు: “నేడు, ఆయన స్వరాన్ని మీరు వింటే,
అరణ్యంలో శోధన సమయంలో, మీరు తిరుగుబాటు చేసిన విధంగా, మీ హృదయాలను కఠినం చేసుకోకండి;
అక్కడ నలభై సంవత్సరాలు నేను చేసిన కార్యాలు వారు చూసి కూడా, మీ పూర్వికులు నన్ను పరీక్షించారు.