కంటెంట్‌కు వెళ్లండి

Siege గురించి బైబిల్ వచనాలు: Distress of the inhabitants during

10 వచనాలు · 4 కోణాలు

Distress of the inhabitants during గురించి వచనాలు

  1. కొంతకాలం తర్వాత, అరాము రాజైన బెన్-హదదు తన సైన్యం అంతటిని పోగుచేసి, సమరయను ముట్టండించాడు.

  2. సమరయలో తీవ్రమైన కరువు వచ్చింది; గాడిద తలను ఎనభై షెకెళ్ళ వెండికి, పావు కాబ్ గువ్వ రెట్టను అయిదు షెకెళ్ళ వెండికి అమ్మారు.

  3. ఒక రోజు ఇశ్రాయేలు రాజు ప్రాకారం దగ్గర నడుస్తూ ఉంటే, ఒక స్త్రీ, “నా ప్రభువా, రాజా, నాకు సహాయం చేయండి!” అంటూ కేక పెట్టింది.

  4. రాజు జవాబిస్తూ, “యెహోవా నీకు సహాయం చేయకపోతే, నేనెక్కడి నుండి సహాయం చేసేది? నూర్పిడి కళ్ళంలో నుంచా? లేదా ద్రాక్ష గానుగ నుంచా?” అన్నాడు.

  5. తర్వాత రాజు ఆమెను, “నీ సమస్య ఏంటి?” అని అడిగాడు. ఆమె, “ఒకామె నాతో, ‘నీ కుమారుని ఇవ్వు, ఈ రోజు వాన్ని తిందాం, రేపు నా కుమారుని తిందాం’ అని చెప్పింది.

  6. కాబట్టి నా కుమారుని వండుకుని తిన్నాము. మరుసటిరోజు నేను ఆమెతో, ‘నీ కుమారుని ఇవ్వు వాన్ని తిందాం’ అన్నాను, కాని ఆమె తన కుమారుని దాచుకుంది” అని చెప్పింది.

  7. నాలుగవ నెల తొమ్మిదవ రోజున కరువు పట్టణంలో మరీ తీవ్రంగా ఉండడంతో ప్రజలకు ఆహారం లేకుండా పోయింది.

  8. కుడి ప్రక్కన దానిని వారు మ్రింగుతారు కాని ఇంకా ఆకలితోనే ఉంటారు. ఎడమ ప్రక్కన దానిని తింటారు కాని తృప్తి పొందరు. వారిలో ప్రతిఒక్కరు తన సంతానం యొక్క మాంసాన్ని తింటారు.

  9. అయితే సైన్యాధిపతి జవాబిస్తూ, “ఈ విషయాలు కేవలం మీకు, మీ యజమానికి మాత్రమే చెప్పటానికి నా యజమాని నన్ను పంపాడని, గోడ మీద కూర్చున్న ప్రజలకు కాదనుకున్నారా? వారు కూడా మీలాగే తమ మలం తింటూ తమ మూత్రం త్రాగాల్సిందే” అని అన్నాడు.

  10. వారు తమ కుమారుల, కుమార్తెల మాంసాన్ని తినేలా చేస్తాను, వారు ఒకరి మాంసాన్ని మరొకరు తింటారు, ఎందుకంటే వారి శత్రువులు వారిని నాశనం చేయడానికి వారిని పూర్తిగా ముట్టడిస్తారు.’