Skip to content

Seed గురించి బైబిల్ వచనాలు

54 వచనాలు · 39 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అప్పుడు దేవుడు, “భూమి వృక్ష సంపదను అనగా విత్తనాలు ఉత్పత్తి చేసే మొక్కలు, వాటి వాటి జాతుల ప్రకారం విత్తనాలతో ఉన్న ఫలమిచ్చే చెట్లను భూమి మొలిపించును గాక” అని అన్నారు. అలాగే జరిగింది.

  2. భూమి వృక్ష సంపదను ఉత్పత్తి చేసింది అంటే, వాటి వాటి జాతుల ప్రకారం విత్తనాలు గల మొక్కలు, వాటి వాటి జాతుల ప్రకారం విత్తనాలతో ఉన్న ఫలమిచ్చే చెట్లు మొలిపించింది. అది మంచిదని దేవుడు చూశారు.

  3. అప్పుడు దేవుడు, “భూమిపై విత్తనాలు ఇచ్చే ప్రతి మొక్కను, విత్తనాలు గల ఫలమిచ్చే ప్రతి చెట్టును మీకు ఆహారంగా ఇస్తున్నాను.

  4. యెహోవా ఆ బలి అర్పణ యొక్క ఇష్టమైన సువాసన పీల్చుకుని తన హృదయంలో ఇలా అనుకున్నారు: “మనుష్యుల హృదయాలోచన బాల్యం నుండే చెడ్డది అయినప్పటికీ, ఇక ఎన్నడు మనుష్యుల కారణంగా భూమిని శపించను. నేను ఇప్పుడు చేసినట్టు ఇంకెప్పుడు సమస్త జీవులను నాశనం చేయను.

  5. “ఈ భూమి ఉన్నంత కాలం, నాటే కాలం కోతకాలం, చలి వేడి, ఎండకాలం చలికాలం, పగలు రాత్రి, ఎప్పుడూ నిలిచిపోవు.”

  6. ఇస్సాకు ఆ దేశంలో విత్తనాలు విత్తాడు, యెహోవా అతన్ని దీవించారు కాబట్టి, అదే సంవత్సరం అతనికి నూరంతల పంట వచ్చింది.

  7. ఒకవేళ నాటబడవలసిన విత్తనాలపై కళేబరం పడితే, అవి పవిత్రంగా ఉంటాయి.

  8. కానీ ఒకవేళ విత్తనాలకు నీరు పెట్టిన తర్వాత, వాటిపై పడితే, అది మీకు అపవిత్రమవుతాయి.

  9. “ ‘నా శాసనాలు పాటించాలి. “ ‘రకరకాల జంతువులతో సంపర్కం కానివ్వకూడదు. “ ‘పొలంలో రెండు జాతుల విత్తనాలు కలిపి చల్లకూడదు. “ ‘రెండు రకాల దారంతో నేసిన బట్టలు ధరించకూడదు.

  10. కానీ ఏడవ సంవత్సరం భూమికి సబ్బాతు విశ్రాంతి సంవత్సరం, అది యెహోవాకు సబ్బాతు. మీ పొలాల్లో విత్తనాలు వేయకూడదు. ద్రాక్షతోటలు సాగుచేయకూడదు.

  11. యాభైయవ సంవత్సరం మీకు వార్షికోత్సవంగా ఉండాలి. ఆ ఏట మీరు విత్తనాలు వేయకూడదు, దానంతట అది పెరిగిన పంట కోయగూడదు. తీర్చిదిద్దని ద్రాక్ష తీగె నుండి పండ్లు కోయగూడదు.

  12. “మేము మా పంటలను నాటడం లేదా పండించకపోతే ఏడవ సంవత్సరంలో మేము ఏమి తింటాము?” అని మీరు అడగవచ్చు.

  13. అప్పుడు నేను మీకు ఇలా చేస్తాను: మీ దృష్టిని నాశనం చేసే, మీ బలాన్ని తగ్గించే ఆకస్మిక భీభత్సం, చెడు వ్యాధులు జ్వరాలు తెస్తాను. మీరు వృధాగా విత్తనాన్ని చల్లుతారు, ఎందుకంటే మీ శత్రువులు దానిని తింటారు.

  14. “ ‘భూమి నుండి వచ్చే ప్రతి దానిలో నుండి దశమభాగం, అది భూమి నుండి వచ్చే ధాన్యమైనా లేదా చెట్ల నుండి వచ్చే ఫలాలైనా, యెహోవాకు చెందినది; అది యెహోవాకు పరిశుద్ధమైనది.

  15. మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం మీరు విడిచి వచ్చిన ఈజిప్టు దేశం వంటిది కాదు; అక్కడ మీరు విత్తనాలు విత్తి కూరతోటలలో చేసినట్లు వాటికి కాళ్లతో నీరు పెట్టారు.

  16. మీ ద్రాక్షతోటలో రెండు రకాల విత్తనాలను నాటవద్దు; మీరు అలా చేస్తే, మీరు వేసే పంటలు మాత్రమే కాకుండా ద్రాక్షతోట యొక్క పండు కూడా అపవిత్రమవుతుంది.

  17. మీకు తెలియని ప్రజలు మీ భూమి, మీ శ్రమ ఉత్పత్తి చేసే వాటిని తింటారు, మీ జీవితమంతా క్రూరమైన అణచివేత తప్ప మీకు ఏమీ ఉండదు.

  18. మీరు పొలంలో చాలా విత్తనాలు విత్తుతారు, కానీ మిడుతలు దాన్ని మ్రింగివేస్తాయి కాబట్టి మీరు కొద్దిగా పంట కోస్తారు.

  19. మీరు నాశనమయ్యే వరకు వారు మీ పశువుల పిల్లలను, మీ భూమిలోని పంటలను మ్రింగివేస్తారు. మీరు నాశనమయ్యే వరకు వారు మీకు ధాన్యం గాని, క్రొత్త ద్రాక్షరసం గాని, ఒలీవనూనె గాని, మీ పశువుల దూడలను గాని, మీ మందల గొర్రెపిల్లలను వదిలిపెట్టరు.

  20. నేను చూసినంత వరకు చెడును దున్ని కీడును నాటేవారు దానినే కోస్తారు.

  21. కన్నీటితో విత్తేవారు సంతోషగానాలతో పంట కోస్తారు.

  22. విత్తనాలను పట్టుకుని, ఏడుస్తూ విత్తడానికి వెళ్లినవారు, సంతోషగానాలతో పనలు మోసుకువస్తారు.

  23. మీ ధాన్యాన్ని సముద్రం గుండా రవాణ చేయండి; చాలా రోజుల తర్వాత దాని నుండి మీరు లాభం పొందవచ్చు.

  24. గాలిని పరిశీలించేవాడు విత్తనాలు చల్లడు; మబ్బులు చూస్తూ ఉండేవాడు పంట కోయడు.

  25. ఉదయాన్నే మీ విత్తనాన్ని విత్తండి, సాయంత్రం వరకు మీ చేతులను వెనుకకు తీయకండి, ఎందుకంటే ఇది ఫలిస్తుందో అది ఫలిస్తుందో, లేదా రెండు సమానంగా ఫలిస్తాయో, మీకు తెలియదు.