Salutations గురించి బైబిల్ వచనాలు: Often sent by letter
Often sent by letter గురించి వచనాలు
నా సహపనివాడైన తిమోతి అలాగే నా తోటి యూదులైన లూకియా, యూసోను, సోసిపత్రు అనేవారు మీకు తమ వందనాలు తెలియజేస్తున్నారు.
ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అనే నేను ప్రభువులో మీకు వందనాలు తెలియజేస్తున్నాను.
నేను అలాగే సంఘమంతా ఆనందించేలా ఆతిథ్యమిచ్చే గాయి మీకు వందనాలు తెలియజేస్తున్నాడు. ఈ పట్టణ ప్రభుత్వ కార్యకలాపాలకు అధికారిగా ఉన్న ఎరస్తు, మన సహోదరుడైన క్వర్తు మీకు తమ వందనాలు తెలియజేస్తున్నారు.
పౌలు అనే నేను నా స్వహస్తంతో ఈ శుభములు వ్రాస్తున్నాను.
పౌలు అనే నేను నా స్వహస్తంతో ఈ శుభములు వ్రాస్తున్నాను. నా సంకెళ్ళను జ్ఞాపకముంచుకోండి. కృప మీతో ఉండును గాక.
పౌలు అనే నేను నా స్వహస్తంతో ఈ శుభములు వ్రాస్తున్నాను, నేను వ్రాసిన ఉత్తరాలన్నింటిలో నేను వ్రాశాను అనడానికి ప్రత్యేకమైన గుర్తు ఇదే.