Rock గురించి బైబిల్ వచనాలు: Figurative
Figurative గురించి వచనాలు
యెహోవా తప్ప దేవుడెవరు? మన దేవుని మించిన కొండ ఎవరు?
“యెహోవా సజీవుడు! నా కొండకు స్తుతి! నా రక్షణ ఆశ్రయమైన దేవునికి మహిమ!
ఇశ్రాయేలు దేవుడు మాట్లాడారు, ఇశ్రాయేలీయుల ఆశ్రయదుర్గం నాతో ఇలా అన్నారు: ‘మనుష్యుల మధ్య నీతిగా పాలించేవాడు, దేవుని భయం కలిగి పాలించేవాడు,
యెహోవా నా కొండ, నా కోట నా విమోచకుడు; నా దేవుడు నేను ఆశ్రయించే నా కొండ, నా డాలు నా రక్షణ కొమ్ము, నా బలమైన కోట.
మీరు నా వైపు చెవియొగ్గి, నన్ను విడిపించడానికి త్వరగా రండి; నా ఆశ్రయదుర్గమై, బలమైన కోటవై నన్ను కాపాడండి.
నాశనకరమైన గుంటలో నుండి నన్ను పైకి లేపారు, బురద ఊబిలో నుండి లేపి నా పాదాలను బండ మీద నిలిపారు. నిలబడడానికి నాకు స్థిరమైన స్థలాన్ని ఇచ్చారు.
నీ రక్షకుడైన దేవుని నీవు మరచిపోయావు; నీ బలానికి ఆధారమైన బండను గుర్తు చేసుకోలేదు. కాబట్టి నీవు అందమైన తోటలు పెంచినా వాటిలో విదేశీ ద్రాక్షతీగెలు నాటినా,
వారిలో ప్రతి ఒక్కరు గాలి వీచినప్పుడు దాక్కునే స్థలంలా తుఫానులో ఆశ్రయంగా ఎడారిలో నీటి ప్రవాహాల్లా ఎండిన భూమిలో ఒక గొప్ప కొండ నీడలా ఉంటారు.
నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, దాని ముందు పాతాళలోక ద్వారాలు నిలువలేవని నేను నీతో చెప్తున్నాను.
అందరు ఒకే ఆత్మీయ నీటిని త్రాగారు. ఎందుకంటే తమతో కూడా ఉన్న ఆత్మీయ బండ నుండి వారు త్రాగారు, ఆ బండ క్రీస్తు.