Rings గురించి బైబిల్ వచనాలు: Used for sealing decrees
Used for sealing decrees గురించి వచనాలు
తర్వాత మొదటి నెల పదమూడవ రోజున రాజ కార్యదర్శులను పిలిపించారు. వారు హామాను ఆజ్ఞలన్నిటిని రాజు సంస్థానాధిపతులకు, సంస్థానాధికారులకు, ఆ సంస్థానాల్లోని ప్రజల అధిపతులకు, అధికారులకు వారి వారి లిపిలో వారి భాషలో వ్రాసి పంపాలని ఆజ్ఞాపించారు. వాటిని రాజైన అహష్వేరోషు పేరిట వ్రాసి వాటిపై రాజు ఉంగరంతో ముద్ర వేశారు.
రాజు పేరిట వ్రాయబడి అతని ఉంగరంతో ముద్ర వేసిన ఏ తాకీదు రద్దు చేయబడదు. కాబట్టి మీకు నచ్చినట్లు యూదుల పక్షాన రాజు పేరిట మరొక శాసనాన్ని వ్రాసి రాజముద్ర వేయండి.”
మొర్దెకై రాజైన అహష్వేరోషు పేరిట తాకీదులను వ్రాయించి రాజు ఉంగరంతో ముద్రించి, రాజు సేవకు ప్రత్యేకంగా ఉపయోగించే గుర్రాలపై వేగంగా స్వారీ చేసే వార్తాహరులతో వాటిని పంపాడు.