కంటెంట్‌కు వెళ్లండి

Remaliah గురించి బైబిల్ వచనాలు: Father of Pekah, king of Israel.

9 వచనాలు · 1 కోణం

Father of Pekah, king of Israel. గురించి వచనాలు

  1. అతని ప్రముఖ అధిపతులలో ఒకడు, రెమల్యా కుమారుడైన పెకహు అతని మీద కుట్ర చేశాడు, అతడు తనతో యాభైమంది గిలాదు వారిని వెంటబెట్టుకొని అర్గోబు, అరీహే అనేవారితో పాటు, పెకహ్యాను సమరయ రాజభవనంలో ఉన్న కోటలో చంపేశాడు. కాబట్టి పెకహు పెకహ్యాను చంపి అతని స్థానంలో రాజయ్యాడు.

  2. యూదా రాజైన అజర్యా పరిపాలన యొక్క యాభై రెండవ సంవత్సరంలో, రెమల్యా కుమారుడైన పెకహు సమరయలో ఇశ్రాయేలుకు రాజయ్యాడు, అతడు ఇరవై సంవత్సరాలు పరిపాలించాడు.

  3. తర్వాత ఏలా కుమారుడైన హోషేయ రెమల్యా కుమారుడైన పెకహు మీద కుట్ర చేశాడు. ఉజ్జియా కుమారుడైన యోతాము పరిపాలన యొక్క ఇరవయ్యవ సంవత్సరంలో అతడు పెకహు మీద దాడి చేసి, అతన్ని చంపి, అతని స్థానంలో రాజయ్యాడు.

  4. రెమల్యా కుమారుడైన పెకహు పరిపాలనలోని పదిహేడవ సంవత్సరంలో యూదారాజు, యోతాము కుమారుడైన ఆహాజు రాజయ్యాడు.

  5. అప్పుడు అరాము రాజైన రెజీను, ఇశ్రాయేలు రాజు, రెమల్యా కుమారుడైన పెకహు యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చి ఆహాజును ముట్టడించారు కాని, అతన్ని జయించలేకపోయారు.

  6. రెమల్యా కుమారుడైన పెకహు ఒకేరోజున యూదాలో 1,20,000 మంది సైనికులను చంపాడు, అలా జరగడానికి కారణం యూదా వారు తమ పూర్వికుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టడమే.

  7. యూదా రాజైన ఉజ్జియాకు పుట్టిన యోతాము కుమారుడైన ఆహాజు కాలంలో సిరియా రాజైన రెజీను, ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడైన పెకహు యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చారు కాని అది వారు జయించలేకపోయారు.

  8. అతనితో, ‘జాగ్రత్త, నెమ్మదిగా ఉండు, భయపడకు. పొగరాజుకుంటున్న ఈ రెండు కాగడాలకు అనగా రెజీను, అరాము, రెమల్యా కుమారుడైన పెకహు యొక్క తీవ్రమైన కోపానికి అధైర్యపడకు.

  9. “ఈ ప్రజలు మెల్లగా పారే షిలోహు నీటిని వద్దు అని, రెజీను గురించి, రెమల్యా కుమారుని గురించి సంతోషిస్తున్నారు,