Skip to content

Rechab గురించి బైబిల్ వచనాలు

9 వచనాలు · 2 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. బెయేరోతీయుడైన రిమ్మోను కుమారులైన రేకాబు, బయనా ఇష్-బోషెతు ఇంటికి బయలుదేరారు. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో అతడు విశ్రాంతి తీసుకుంటుండగా వారు అక్కడికి వచ్చారు.

  2. వారు గోధుమలు తెస్తున్నట్లు నటించి ఇంటి లోపలికి వెళ్లి పడుకున్న ఇష్-బోషెతు కడుపులో పొడిచారు. రేకాబు అతని సోదరుడు బయనా తప్పించుకుని పారిపోయారు.

  3. అతడు తన మంచంపై పడుకుని నిద్రపోతున్నప్పుడు వారు ఇంటి లోపలికి వెళ్లారు. వారు అతన్ని పొడిచి చంపిన తర్వాత అతని తల నరికి తమతో తీసుకెళ్లి రాత్రంతా అరాబా గుండా ప్రయాణం చేశారు.

  4. హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరకు ఇష్-బోషెతు తల తీసుకువచ్చి రాజుతో, “రాజా! నిన్ను చంపాలనుకున్న నీ శత్రువు సౌలు కుమారుడైన ఇష్-బోషెతు తల ఇదిగో. ఈ రోజున నా ప్రభువు రాజువైన నీ పక్షంగా సౌలుకు అతని సంతానానికి యెహోవా ప్రతీకారం చేశారు” అన్నాడు.

  5. దావీదు బెయేరోతీయుడైన రిమ్మోను కుమారులైన రేకాబు, అతని సోదరుడు బయనాకు ఇలా జవాబిచ్చాడు: “నిశ్చయంగా, అన్ని కష్టాల నుండి నన్ను విడిపించిన సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న,

  6. మంచివార్త తెచ్చాననుకుని ఒకడు నాతో సౌలు చనిపోయాడని చెప్పినప్పుడు నేను అతన్ని పట్టుకుని సిక్లగులో చంపించాను. ఇదే నేను అతనికి ఇచ్చిన బహుమానము.

  7. అలాంటప్పుడు, దుర్మార్గులైన మీరు ఒక అమాయకున్ని అతని ఇంట్లోనే అతని మంచంపైనే చంపితే, మీరు చేసిన హత్యకు శిక్షించకుండా ఉంటానా? మిమ్మల్ని ఈ లోకం నుండి తుడిచివేయకుండా ఉంటానా?”

  8. వెంటనే దావీదు తన సైనికులకు ఆజ్ఞ ఇవ్వగా వారు ఆ ఇద్దరిని చంపేశారు. వారి కాళ్లు చేతులు నరికి వారి శవాలను హెబ్రోను కొలను దగ్గర తగిలించారు. ఇష్-బోషెతు తల తీసుకెళ్లి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టారు.

  9. పెంట గుమ్మాన్ని బేత్-హక్కెరెము ప్రదేశానికి అధిపతియైన రేకాబు కుమారుడైన మల్కీయా బాగుచేశాడు. అతడు దానికి మరమ్మత్తులు చేసి తలుపులు నిలబెట్టి తాళాలు గడియలు బిగించాడు.