కంటెంట్‌కు వెళ్లండి

Prosperity గురించి బైబిల్ వచనాలు: From God

7 వచనాలు · 8 కోణాలు

"Prosperity" కోసం వెతకండి

From God గురించి వచనాలు

  1. దయచేసి నేను తెచ్చిన ఈ కానుకను స్వీకరించు, ఎందుకంటే దేవుడు నన్ను కనికరించారు, నాకు అవసరమైనది నా దగ్గర ఉన్నది.” యాకోబు పట్టుబట్టడంతో ఏశావు దానిని స్వీకరించాడు.

  2. కానీ అతని విల్లు స్థిరంగా నిలిచింది, అతని చేతులు బలంగా ఉన్నాయి, ఎందుకంటే యాకోబు యొక్క బలవంతుని హస్తాన్ని బట్టి, కాపరి, ఇశ్రాయేలు యొక్క బండను బట్టి,

  3. నీకు సహాయం చేసే నీ తండ్రి యొక్క దేవున్ని బట్టి, పైనున్న ఆకాశాల దీవెనలతో, క్రింది అగాధజలాల దీవెనలతో, స్తనాల దీవెనలతో గర్భం యొక్క దీవెనలతో, నిన్ను ఆశీర్వదించే సర్వశక్తిమంతున్ని బట్టి బలపరచబడ్డాయి.

  4. నీ తండ్రి ఆశీర్వాదాలు పురాతన పర్వత ఆశీర్వాదాల కంటే, ప్రాచీన కొండల యొక్క కోరదగిన వాటికంటే గొప్పవి. ఇవన్నీ యోసేపు తలమీద, తన సోదరులలో అధికారిగా ఉన్న వాడిపై ఉండాలి.

  5. సొలొమోను యాత్రకీర్తన. యెహోవా ఇల్లు కడితేనే తప్ప దానిని కట్టే వారి శ్రమ అంతా వ్యర్థమే. యెహోవా పట్టణాన్ని కావలి ఉండకపోతే దాన్ని కాపలా కాసేవారు నిలబడి కాయడం వ్యర్థమే.

  6. యాత్రకీర్తన. యెహోవా పట్ల భయం కలిగి, ఆయన మార్గాలను అనుసరించేవారు ధన్యులు.

  7. మీరు మీ కష్టార్జితాన్ని తింటారు; ఆశీర్వాదం అభివృద్ధి మీకు కలుగుతుంది.