కంటెంట్‌కు వెళ్లండి

Proselytes గురించి బైబిల్ వచనాలు: Were entitled to all privileges

6 వచనాలు · 14 కోణాలు

Were entitled to all privileges గురించి వచనాలు

  1. “మీ మధ్య నివసించే విదేశీయులు యెహోవా పస్కాను ఆచరించాలనుకుంటే అతని ఇంట్లోని మగవారందరు సున్నతి పొందాలి. అప్పుడు వారు దేశంలో పుట్టినవారిలా దానిలో పాల్గొనవచ్చు. సున్నతి పొందని మగవారు దీనిని తినకూడదు.

  2. యెహోవాను వెంబడించే ఏ విదేశీయుడైనా, “యెహోవా తన ప్రజల్లో నుండి నన్ను వెలివేస్తారు” అని అనకూడదు. ఏ నపుంసకుడైనా, “నేను కేవలం ఎండిన చెట్టును” అని అనకూడదు.

  3. ఎందుకంటే యెహోవా చెప్పే మాట ఇదే: “నేను నియమించిన సబ్బాతును పాటిస్తూ నాకిష్టమైన వాటిని కోరుకుంటూ నా నిబంధనకు నమ్మకంగా ఉండే నపుంసకులకు,

  4. నా మందిరంలో, నా గోడలలో, కుమారులు, కుమార్తెలు కలిగి ఉన్న దానికన్న శ్రేష్ఠమైన జ్ఞాపకార్థాన్ని, పేరును ఇస్తాను. ఎప్పటికీ నిలిచివుండే నిత్యమైన పేరు వారికి నేను ఇస్తాను.

  5. యెహోవాకు కట్టుబడి ఉంటూ ఆయనకు సేవ చేస్తూ, యెహోవా నామాన్ని ప్రేమిస్తూ, ఆయన సేవకులుగా ఉంటూ సబ్బాతును అపవిత్రపరచకుండా పాటిస్తూ, నా నిబంధన నమ్మకంగా పాటిస్తున్న విదేశీయులందరిని

  6. నా పరిశుద్ధ పర్వతం దగ్గరకు తీసుకువస్తాను, నా ప్రార్థన మందిరంలో వారికి ఆనందాన్ని ఇస్తాను. నా బలిపీఠం మీద వారు అర్పించే దహనబలులు అర్పణలు అంగీకరించబడతాయి; నా మందిరం అన్ని దేశాలకు ప్రార్థన మందిరం అని పిలువబడుతుంది.”