Skip to content

Priest గురించి బైబిల్ వచనాలు

14 వచనాలు · 4 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలు ఉన్నారు, వారు వచ్చి తమ తండ్రి మందకు నీళ్లు పెట్టడానికి నీళ్లు తోడి తొట్టెలు నింపడం మొదలుపెట్టారు.

  2. మీరు నాకు ఒక యాజకుల రాజ్యంగా పరిశుద్ధ జనంగా ఉంటారు.’ నీవు ఇశ్రాయేలీయులతో చెప్పాల్సిన మాటలు ఇవే” అని చెప్పారు.

  3. ఈ విషయాలన్ని జరిగిన తర్వాత నాయకులు నా దగ్గరకు వచ్చి, “ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, అందరు తమ పొరుగువారైన కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఈజిప్టువారు, అమోరీయుల నుండి వేరుగా ఉండకుండా వారితో కలిసిపోయి, వారు చేసే అసహ్యకరమైన ఆచారాలను పాటించారు.

  4. వారి కుమార్తెలను తమకు, తమ కుమారులకు భార్యలుగా చేసుకుంటూ, పరిశుద్ధజాతిగా ఉండకుండా తమ చుట్టూ ఉన్నవారితో కలిసిపోయారు. నాయకులు అధికారులు ఈ విషయంలో అపనమ్మకంగా ఉన్నారు” అని చెప్పారు.

  5. అప్పుడు ఎజ్రా లేచి, ముఖ్య యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయులందరు ఆ మాట ప్రకారం చేసేలా వారితో ప్రమాణం చేయించాడు. వారు ప్రమాణం చేశారు.

  6. యాజకుల వారసులలో పరాయి దేశపు స్త్రీలను పెళ్ళి చేసుకున్న వారు వీరు: యోజాదాకు కుమారుడైన యెషూవ వారసులు, అతని సహోదరుల నుండి: మయశేయా, ఎలీయెజెరు, యారీబు, గెదల్యా.

  7. (వీరంతా తమ భార్యలను పంపివేస్తామని మాట ఇచ్చారు. తమ దోషాన్ని బట్టి అపరాధపరిహారబలిగా ఒక్కొక్కరు మందలో ఒక్కొక్క పొట్టేలు అర్పించారు.)

  8. మిగిలిన ప్రజలు అనగా, యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, సంగీతకారులు, ఆలయ సేవకులు దేవుని ధర్మశాస్త్రం బట్టి తమను ఆ దేశ ప్రజల నుండి వేరు చేసుకున్న వారందరు గ్రహించగలిగిన తమ భార్యలు కుమారులు కుమార్తెలతో పాటు,

  9. మీరు యెహోవా యాజకులని పిలువబడతారు, మా దేవుని సేవకులు అని మీకు పేరు పెట్టబడుతుంది. దేశాల సంపదను మీరు అనుభవిస్తారు వారి ఐశ్వర్యాన్ని పొంది అతిశయిస్తారు.

  10. ఇలా అన్ని ఏర్పాటు చేయబడిన తర్వాత, ప్రతిరోజు యాజకులు తమ పరిచర్యను చేయడానికి మొదటి గదిలోకి వెళ్తారు.

  11. కాని మీరైతే చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుని మంచితనాన్ని ప్రకటించడానికి ఏర్పరచబడిన ప్రజలుగా, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా, దేవుని ప్రత్యేకమైన సొత్తుగా ఉన్నారు.

  12. తన తండ్రియైన దేవునికి పరిచర్య చేసే యాజకుల రాజ్యంగా మనల్ని చేసిన ఆయనకే మహిమా ప్రభావం నిరంతరం కలుగును గాక ఆమేన్.

  13. నీవు వారిని దేవుని సేవించే రాజ్యంగా యాజకులుగా చేశావు, భూమిని పరిపాలించడానికి వారిని నియమించావు.”

  14. మొదటి పునరుత్థానంలో పాలుపొందినవారు ధన్యులు పరిశుద్ధులు. రెండవ మరణానికి వారి మీద అధికారం లేదు. అయితే వారు దేవునికి క్రీస్తుకు యాజకులుగా ఉంటూ ఆయనతో పాటు వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తారు.