Skip to content

Philosophy గురించి బైబిల్ వచనాలు

90 వచనాలు · 5 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “ఒకవేళ నేనే నువ్వైతే, నేను దేవునికే మొరపెడతాను; ఆయన ఎదుట నా వాదన చెప్పుకుంటాను.

  2. పరిశోధించలేని మహాకార్యాలను లెక్కించలేని అద్భుత క్రియలను ఆయన చేస్తారు.

  3. ఆయన భూమిపై వాన కురిపిస్తారు; పొలాలకు నీటిని పంపిస్తారు.

  4. ఆయన దీనావస్థలోనున్న వారిని పైకి లేపుతారు, దుఃఖపడేవారిని క్షేమానికి లేవనెత్తుతారు.

  5. వంచకుల చేతులు విజయం సాధించకుండ, ఆయన వారి ఆలోచనలను తలక్రిందులు చేస్తారు.

  6. జ్ఞానులను వారి యుక్తిలోనే ఆయన పట్టుకుంటారు, వంచకుల ఆలోచనలు తుడిచివేయబడతాయి.

  7. పగటివేళ వారి మీదికి చీకటి వస్తుంది; రాత్రిలో తడుముకున్నట్లు వారు మధ్యాహ్న వేళలో తడుముకుంటారు.

  8. వారి నోటి నుండి వచ్చే పదునైన మాటల నుండి ఆయన బీదలను రక్షిస్తారు; బలవంతుల చేతిలో నుండి ఆయన వారిని రక్షిస్తారు.

  9. కాబట్టి బీదలకు నిరీక్షణ ఉంది, అన్యాయం తన నోరు మూసుకుంటుంది.

  10. “దేవుడు సరిదిద్దేవారు ధన్యులు; కాబట్టి సర్వశక్తిమంతుని క్రమశిక్షణను నిర్లక్ష్యం చేయకు.

  11. గాయం చేసేది ఆయనే, గాయాన్ని కట్టేది కూడా ఆయనే; ఆయన గాయపరుస్తారు, కాని ఆయన చేతులే స్వస్థపరుస్తాయి.

  12. ఆరు ఆపదల్లో నుండి ఆయన నిన్ను విడిపిస్తారు; ఏడు బాధల్లో ఏ హాని నిన్ను తాకదు.

  13. కరువు కాలంలో చావు నుండి, యుద్ధంలో ఖడ్గం అంచు నుండి ఆయన నిన్ను తప్పిస్తారు.

  14. నేను దేవునితో ఇలా అంటాను: నన్ను దోషిగా భావించకండి, కాని నా మీద మీకున్న ఆరోపణలు నాకు చెప్పండి.

  15. నన్ను హింసించడం, మీ చేతిపనిని త్రోసివేయడం, దుర్మార్గుల ప్రణాళికలను చూసి సంతోషించడం మీకు ఇష్టమా?

  16. మీ కళ్లు మనుష్యుల కళ్లలాంటివా? మనుష్యులు చూసేటట్లు మీరు చూస్తారా?

  17. మీ రోజులు మానవుల రోజుల వంటివా మీ సంవత్సరాలు బలమైన మనుష్యుల సంవత్సరాల వంటివా?

  18. నేను దోషిని కానని మీ చేతిలో నుండి నన్ను ఎవరూ విడిపించలేరని మీకు తెలిసినప్పటికీ నా అపరాధాలను మీరు వెదకుతున్నారు? నా పాపాలను మీరు పరిశోధిస్తున్నారు?

  19. Thou knowest that I am not wicked; and there is none that can deliver out of thine hand.

  20. “మీ చేతులు నన్ను రూపొందించి తయారుచేశాయి. ఇప్పుడు మీరు నన్ను తిరిగి నాశనం చేస్తారా?

  21. బంకమట్టిలా నన్ను రూపొందించారని జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు నన్ను తిరిగి మట్టిలా మారుస్తారా?

  22. పాలు పోసినట్లు మీరు నన్ను పోయలేదా, జున్నుగడ్డ పేరబెట్టినట్లు నన్ను చేయలేదా,

  23. చర్మంతో మాంసంతో నన్ను కప్పి ఎముకలు నరాలతో కలిపి అల్లలేదా?

  24. మీరు నాకు జీవాన్ని ఇచ్చి దయ చూపించారు, మీ సంరక్షణతో నా ఆత్మను కాపాడారు.

  25. “అయితే ఇది మీ హృదయంలో దాచుకున్నారు, ఇది మీ మనస్సులో ఉన్నదని నాకు తెలుసు: