Skip to content

Noph గురించి బైబిల్ వచనాలు

13 వచనాలు · 2 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. సోయను అధిపతులు మూర్ఖులయ్యారు, మెంఫిసు నాయకులు మోసపోయారు. ఈజిప్టు గోత్రానికి మూలరాళ్లుగా ఉన్నవారు దానిని దారి తప్పేలా చేశారు.

  2. అలాగే, మెంఫిసు, తహ్పన్హేసు పట్టణస్థులు, నీ పుర్రె పగులగొట్టారు.

  3. ఈజిప్టుపై దాడి చేయడానికి బబులోను రాజైన నెబుకద్నెజరు రావడం గురించి యెహోవా యిర్మీయా ప్రవక్తతో చెప్పిన సందేశం ఇది:

  4. “ఈజిప్టులో ప్రకటన చేయండి, మిగ్దోలులో చాటించండి; మెంఫిసులో, తహ్పన్హేసులో కూడా చాటించండి: ‘ఖడ్గం నీ చుట్టూ ఉన్నవారందరిని హతమారుస్తుంది, కాబట్టి మీరు మీ స్థానాల్లో సిద్ధంగా ఉండండి.’

  5. నీ బలవంతులు ఎందుకు దిగజారిపోతారు? వారు నిలబడలేరు, ఎందుకంటే యెహోవా వారిని క్రిందికి నెట్టివేస్తారు.

  6. వారు పదే పదే తడబడతారు; వారు ఒకరి మీద ఒకరు పడతారు. వారు, ‘లేవండి, మనం అణచివేసే వారి ఖడ్గానికి దూరంగా, మన స్వదేశాలకు, మన సొంత ప్రజల దగ్గరికి తిరిగి వెళ్దాం’ అని చెప్తారు.

  7. అక్కడ వారు, ‘ఈజిప్టు రాజు ఫరో పెద్ద శబ్దం మాత్రమే; అతడు తన అవకాశాన్ని కోల్పోయాడు’ అని గట్టిగా కేకలు వేస్తారు.

  8. “నా జీవం తోడు” అని రాజు ప్రకటిస్తున్నారు, ఆయన పేరు సైన్యాల యెహోవా, “పర్వతాల మధ్య తాబోరు లాంటివాడు, సముద్రం ఒడ్డున ఉన్న కర్మెలు లాంటివాడు వస్తాడు.

  9. ఈజిప్టులో నివసించేవారలారా, బందీలుగా వెళ్లడానికి మీ సామాన్లు సర్దుకోండి, ఎందుకంటే మెంఫిసు పాడుచేయబడి, నివాసులు లేక శిథిలమవుతుంది.

  10. “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: “ ‘విగ్రహాలను నాశనం చేసి మెంఫిసులో ఒక్క విగ్రహం కూడా మిగలకుండా చేస్తాను. ఈజిప్టు దేశంలో ఒక్క యువరాజు కూడా ఉండడు, ఆ దేశమంతా భయం పుట్టిస్తాను.

  11. పత్రూసు పాడుచేస్తాను, సోయనులో అగ్ని పుట్టిస్తాను తేబేసుకు శిక్ష విధిస్తాను.

  12. ఈజిప్టుకు కోటయైన సీను మీద నా ఉగ్రతను కుమ్మరిస్తాను. తేబేసు అల్లరిమూకలను నిర్మూలం చేస్తాను.

  13. ఈజిప్టు దేశంలో మంట పుట్టిస్తాను. సీను వేదనతో మెలికలు తిరుగుతుంది. తేబేసు తుఫాను తాకిడికి చిన్నాభిన్నం అవుతుంది; మెంఫిసు నిరంతరం బాధలో ఉంటుంది.