Night గురించి బైబిల్ వచనాలు: Used figuratively
Used figuratively గురించి వచనాలు
మోయాబుకు వ్యతిరేకంగా ప్రవచనం: ఒక రాత్రిలోనే మోయాబులోని ఆరు పట్టణం పాడై నశిస్తుంది! ఒక రాత్రిలోనే మోయాబులోని కీరు పట్టణం పాడై నశిస్తుంది!
దూమాకు వ్యతిరేకంగా ప్రవచనం: ఒకడు శేయీరులో నుండి నన్ను పిలుస్తున్నాడు, “కావలివాడా, రాత్రి ఇంకా ఎంత ఉంది? కావలివాడా, రాత్రి ఇంకా ఎంత ఉంది?”
కావలివాడు, “ఉదయం అవుతుంది, రాత్రి కూడా అవుతుంది. మీరు అడగాలనుకుంటే అడగండి; మరలా తిరిగి రండి” అని సమాధానం ఇస్తాడు.
పగలున్నంత వరకు నన్ను పంపినవాని పనులను మనం చేస్తూ ఉండాలి. రాత్రి వస్తుంది అప్పుడు ఎవరూ పని చేయలేరు.
రాత్రి చాలా వరకు గడిచిపోయింది; పగలు దాదాపు వచ్చేసింది. కాబట్టి మనం చీకటి క్రియలు విడిచిపెడదాం, వెలుగు కవచాన్ని ధరించుకుందాము.
మీరంతా వెలుగు సంతానం పగటి సంతానము. మనం చీకటికి లేదా రాత్రికి చెందినవారం కాదు.