Skip to content

Name గురించి బైబిల్ వచనాలు: Symbolic

5 వచనాలు · 2 కోణాలు

Symbolic గురించి వచనాలు

  1. కాబట్టి అతడు దిబ్లయీము కుమార్తెయైన గోమెరును పెళ్ళి చేసుకున్నాడు, ఆమె గర్భవతియై అతనికి కుమారున్ని కన్నది.

  2. అప్పుడు యెహోవా హోషేయతో అన్నారు, “అతనికి యెజ్రెయేలు అనే పేరు పెట్టు, ఎందుకంటే యెజ్రెయేలులో జరిగిన రక్తపాతాన్ని బట్టి త్వరలో నేను యెహు వంశాన్ని శిక్షిస్తాను, ఇశ్రాయేలు రాజ్యాన్ని తుదముట్టిస్తాను.

  3. గోమెరు మళ్ళీ గర్భవతియై ఆడపిల్లను కన్నది. అప్పుడు యెహోవా హోషేయతో ఇలా అన్నారు, “ఆమెకు లో-రుహామా అని పేరు పెట్టు, ఎందుకంటే నేను ఇక ఇశ్రాయేలును ప్రేమించను వారిని ఏమాత్రం క్షమించను.

  4. అప్పుడు యెహోవా ఇలా అన్నారు, “అతనికి లో-అమ్మీ అని పేరు పెట్టు, ఎందుకంటే మీరు నా జనం కాదు, నేను మీ దేవుడను కాదు.

  5. “మీరు మీ సోదరులతో, ‘మీరు నా ప్రజలు’ అని, మీ సహోదరీలతో, ‘నా ప్రియమైన వారలారా’ అని అనండి.