Skip to content

Military Arms గురించి బైబిల్ వచనాలు

11 వచనాలు · 44 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. ఇశ్రాయేలీయుల దేశమంతటిలో కమ్మరివారు లేకుండ చేశారు, ఎందుకంటే, “హెబ్రీయులు కత్తులు ఈటెలు తయారుచేయించకూడదు” అని ఫిలిష్తీయులు అనుకున్నారు.

  2. కాబట్టి ఇశ్రాయేలీయులందరు తమ నాగలి నక్కులు, పారలు, గొడ్డళ్లు, కొడవళ్లకు పదును పెట్టించడానికి ఫిలిష్తీయుల దగ్గరకు వెళ్లవలసి వచ్చేది.

  3. నాగలి కొనలు పారల పదునుకు షెకెలులో మూడింట రెండు వంతులు, ముండ్ల కొంకులు, గొడ్డళ్ళ పదునుకు, ములికోలు సరిచేయడానికి ఒక షెకెలులో మూడవ వంతు చెల్లించాలి.

  4. కాబట్టి యుద్ధం జరిగే రోజున సౌలుతో యోనాతానుతో ఉన్న ప్రజల్లో ఒకరి చేతిలోనూ కత్తి గాని ఈటె గాని లేదు; కేవలం సౌలుకు అతని కుమారుడైన యోనాతానుకు మాత్రమే ఉన్నాయి.

  5. “మనుష్యకుమారుడా, నీవు ప్రవచించి ఇలా చెప్పు: ‘యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘ఒక ఖడ్గం, ఒక ఖడ్గం పదును పెట్టబడి మెరుగు పెట్టబడింది.

  6. వధించడానికి పదును పెట్టబడింది, మెరుపులా మెరిసేలా మెరుగు పెట్టబడింది! “ ‘నా కుమారుని రాజదండాన్ని బట్టి మనం సంతోషిద్దామా? అలాంటి ప్రతి దండాన్ని ఆ ఖడ్గం తృణీకరిస్తుంది.

  7. “ ‘ఆ ఖడ్గం మెరుగుపరచడానికి, చేతితో పట్టుకోడానికి నియమించబడింది; హతం చేసేవాడు పట్టుకోడానికి, అది పదును పెట్టబడి, మెరుగు పెట్టబడి సిద్ధంగా ఉంది.

  8. మీరు అపవాది తంత్రాలను ఎదిరించడానికి శక్తిమంతులు కావడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.

  9. ఎందుకంటే, మనం పోరాడేది శరీరులతో కాదు, కాని పాలకులతో, అధికారులతో, ఈ చీకటి లోకపు శక్తులతో ఆకాశమండలంలో ఉన్న దురాత్మల బలగాలతో వ్యతిరేకంగా పోరాడుతున్నాము.

  10. అందుకే ఆపద రోజున మీరు వారిని ఎదిరించడానికి, శక్తిమంతులుగా నిలబడడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.

  11. స్థిరంగా నిలబడి, మీ నడుములకు సత్యమనే నడికట్టు కట్టుకుని, నీతి అనే కవచాన్ని ధరించుకొని,