Skip to content

Midwifery గురించి బైబిల్ వచనాలు

9 వచనాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. బిడ్డకు జన్మనివ్వడంలో చాల శ్రమపడింది. మంత్రసాని, “భయపడకమ్మా, నీవు ఇంకొక మగపిల్లవాన్ని కన్నావు” అని చెప్పింది.

  2. ఈజిప్టు రాజు, షిఫ్రా పూయా అనే హెబ్రీ మంత్రసానులతో మాట్లాడుతూ,

  3. “హెబ్రీ స్త్రీలకు ప్రసవ సమయంలో కాన్పుపీట దగ్గర మీరు వారికి సహాయం చేస్తున్నప్పుడు పుట్టింది మగపిల్లవాడైతే వానిని చంపెయ్యండి, ఆడపిల్ల పుడితే బ్రతకనివ్వండి” అని అన్నాడు.

  4. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఈజిప్టు రాజు తమతో చెప్పింది చేయకుండా మగపిల్లలను బ్రతకనిచ్చారు.

  5. ఈజిప్టు రాజు ఆ స్త్రీలను పిలిపించి, “మీరెందుకు ఇలా చేశారు? మగపిల్లలను ఎందుకు బ్రతకనిచ్చారు?” అని వారిని అడిగాడు.

  6. అందుకు ఆ మంత్రసానులు, “హెబ్రీ స్త్రీలు ఈజిప్టు స్త్రీల వంటివారు కారు; వారు బలం గలవారు, మంత్రసానులు వారి దగ్గరకు రావడానికి ముందే ప్రసవిస్తున్నారు” అని ఫరోతో చెప్పారు.

  7. కాబట్టి దేవుడు ఆ మంత్రసానుల పట్ల దయ చూపించారు, ప్రజలు మరింత ఎక్కువగా విస్తరించారు.

  8. ఆ మంత్రసానులు దేవునికి భయపడ్డారు, కాబట్టి ఆయన వారి సొంత కుటుంబాలను వృద్ధిచేశారు.

  9. నీ జన్మ విధానం చూస్తే, నీవు పుట్టిన రోజున నీ నాభి సూత్రం కత్తిరించబడలేదు, నిన్ను నీళ్లతో శుభ్రం చేయలేదు, ఉప్పుతో రుద్దలేదు, గుడ్డలో చుట్టలేదు.