Skip to content

Menstruation గురించి బైబిల్ వచనాలు

20 వచనాలు · 6 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. అబ్రాహాము శారా అప్పటికే చాలా వృద్ధులు, శారా పిల్లలు కనే వయస్సు దాటిపోయింది.

  2. రాహేలు తన తండ్రితో, “నా ప్రభువా! నాపై కోప్పడకండి, నేను మీ ఎదుట లేవలేను, నేను నెలసరిలో ఉన్నాను” అని చెప్పింది. కాబట్టి లాబాను వెదకినా అతనికి తన గృహదేవతల విగ్రహాలు దొరకలేదు.

  3. “ ‘ఒక స్త్రీకి నెలసరి సమయంలో రక్తస్రావం జరిగినప్పుడు ఆమె నెలసరి అపవిత్రత ఏడు రోజులు ఉంటుంది, ఆమెను తాకిన వారెవరైనా సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు.

  4. “ ‘నెలసరి సమయంలో ఆమె దేనిపై పడుకుంటుందో అది అపవిత్రం అవుతుంది, ఆమె దేనిపై కూర్చుంటుందో అది అపవిత్రం అవుతుంది.

  5. ఆమె పడకను తాకినవారు అపవిత్రులవుతారు; వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు.

  6. ఆమె కూర్చున్న దాన్ని తాకినవారు అపవిత్రులవుతారు; వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు.

  7. ఆమె పడకను గాని ఆమె కూర్చున్న దానిని గాని తాకినవారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు.

  8. “ ‘ఒక వ్యక్తి ఆమెతో లైంగికంగా కలిసినప్పుడు ఆమె నెలసరి అతన్ని తాకితే, అతడు ఏడు రోజులు అపవిత్రునిగా ఉంటాడు; అతడు పడుకున్న ఏ పడకయైనా అపవిత్రమవుతుంది.

  9. “ ‘ఒక స్త్రీకి తన నెలసరి సమయం కాకుండా చాలా రోజులు రక్తస్రావం జరిగినా లేదా ఆమె నెలసరి వ్యవధి మించి రక్తస్రావం కొనసాగితే, రక్తస్రావం ఉన్నంత వరకు నెలసరి రోజుల్లా ఆమె అపవిత్రంగా ఉంటుంది.

  10. ఆమెకు రక్తస్రావం కొనసాగుతున్నప్పుడు ఆమె పడుకున్న ఏ పడకైనా ఆమె నెలసరి సమయంలో ఉన్నప్పటిలాగే ఆ పడక అపవిత్రం, అలాగే ఆమె దేనిపై కూర్చున్న అది అపవిత్రం అవుతుంది.

  11. వాటిని తాకినవారు అపవిత్రులు; వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు.

  12. “ ‘ఆమె స్రావం నుండి శుద్ధి చేయబడినప్పుడు, ఆమె ఏడు రోజులు లెక్కించి అవి ముగిసిన తర్వాత ఆమె పవిత్రమవుతుంది.

  13. ఎనిమిదవ రోజున ఆమె రెండు గువ్వలను గాని, రెండు పావురం పిల్లలను గాని తీసుకువచ్చి సమావేశ గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర యాజకునికి ఇవ్వాలి.

  14. యాజకుడు వాటిలో ఒకదాన్ని పాపపరిహారబలిగా ఒకదాన్ని దహనబలిగా అర్పించాలి. ఈ విధంగా యాజకుడు స్త్రీకి స్రావం ద్వార కలిగిన అపవిత్రతకు యెహోవా ఎదుట ప్రాయశ్చిత్తం చేయాలి.

  15. “ ‘ఒకడు నెలసరిలో ఉన్న స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకుంటే అతడు ఆమె రక్తస్రావాన్ని బహిర్గతం చేశాడు, ఆమె కూడ దానిని బయటపెట్టింది. కాబట్టి వారిద్దరిని ప్రజల్లో నుండి తొలగించాలి.

  16. అప్పుడు వెండితో పొదిగిన మీ విగ్రహాలను, బంగారంతో పొదిగిన మీ ప్రతిమలను మీరు అపవిత్రం చేస్తారు; రుతు గుడ్డను పడేసినట్లు వాటిని పడేసి, “ఇక్కడినుండి పొండి” అని వాటితో అంటారు.

  17. ఎడారికి అలవాటు పడిన అడవి గాడిదవు, అది కామంతో గాలిని పసిగడుతుంది, అది తాపంలో ఉన్నప్పుడు దానిని ఎవరు అడ్డుకోగలరు? దాన్ని వెంటాడే మగ గాడిదలకు అలసట రాదు; అది కలుసుకునే సమయంలో అది వారికి కనబడుతుంది.

  18. సీయోను చేతులు చాచింది, ఆమెను ఓదార్చడానికి ఎవరూ లేరు. యాకోబుకు తన పొరుగువారే శత్రువులుగా మారాలని యెహోవా శాసించారు; యెరూషలేము వారి మధ్య అపవిత్రం అయ్యింది.

  19. అతడు పర్వత క్షేత్రాల మీద భోజనం చేయడు, ఇశ్రాయేలీయుల విగ్రహాలవైపు చూడడు, తన పొరుగువాని భార్యను అపవిత్రం చేయడు, బహిష్టులో ఉన్న స్త్రీతో లైంగికంగా కలవడు,

  20. “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయులు తమ స్వదేశంలో నివసిస్తున్నప్పుడు, వారు తమ ప్రవర్తనతో తమ చేష్టలతో దానిని అపవిత్రం చేశారు. నా దృష్టికి వారి ప్రవర్తన నెలసరిలో ఉన్న స్త్రీ అపవిత్రతలా ఉంది.