కంటెంట్‌కు వెళ్లండి

Megiddo గురించి బైబిల్ వచనాలు: Josiah slain at, by Pharaoh Nechoh

5 వచనాలు · 8 కోణాలు

Josiah slain at, by Pharaoh Nechoh గురించి వచనాలు

  1. యోషీయా రాజుగా ఉన్నప్పుడు, ఈజిప్టు రాజైన ఫరో నెకో యూఫ్రటీసు నది దగ్గర అష్షూరు రాజుకు యుద్ధంలో సహాయపడడానికి వెళ్లాడు. రాజైన యోషీయా అతన్ని ఎదుర్కోబోయాడు, అయితే నెకో అతన్ని మెగిద్దో దగ్గర చంపాడు.

  2. యెషీయా సేవకులు అతని మృతదేహాన్ని మెగిద్దో నుండి యెరూషలేముకు రథంలో తీసుకువచ్చి అతని సమాధిలో పాతిపెట్టారు. దేశ ప్రజలు యోషీయా కుమారుడైన యెహోయాహాజును అభిషేకించి, అతని తండ్రి స్థానంలో అతన్ని రాజుగా చేశారు.

  3. అయితే యోషీయా అతని దగ్గర నుండి వెళ్లడానికి ఇష్టపడలేదు. అతనితో యుద్ధం చేయాలని మారువేషం వేసుకుని దేవుని ఆజ్ఞగా నెకో చెప్పిన దానిని వినక, మెగిద్దోను మైదానాల్లో యుద్ధం చేయడానికి వెళ్లాడు.

  4. విలుకాండ్రు రాజైన యోషీయా మీద బాణాలు వేశారు. రాజు తన అధికారులతో, “నేను తీవ్రంగా గాయపడ్డాను. ఇక్కడినుండి నన్ను తీసుకెళ్లండి” అని చెప్పాడు.

  5. అతని సేవకులు అతన్ని తన రథం మీద నుండి దించి అతనికున్న వేరే రథం మీద ఉంచి యెరూషలేముకు తీసుకువచ్చారు. అక్కడ అతడు చనిపోయాడు. అతని పూర్వికుల సమాధుల మధ్య యోషీయాను పాతిపెట్టారు. అతని మృతికి యూదా, యెరూషలేము ప్రజలంతా దుఃఖించారు.