కంటెంట్‌కు వెళ్లండి

Leprosy గురించి బైబిల్ వచనాలు

61 వచనాలు · 50 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యాజకుడు ఆ పుండును పరీక్షించాలి, ఒకవేళ అది చర్మంపై లోతుగా ఉండి అందులో పసుపు రంగులో సన్నని వెంట్రుకలుంటే, యాజకుడు వారిని అపవిత్రులని ప్రకటించాలి; అది తలమీద గాని గడ్డం మీద గాని ఏర్పడిన గజ్జిపుండు.

  2. కాని యాజకుడు ఆ పుండును పరీక్షించినప్పుడు, అది చర్మంపై లోతుగా లేకపోతే, యాజకుడు వారిని ఏడు రోజులు వేరుగా ఉంచాలి.

  3. ఏడవ రోజు యాజకుడు ఆ గజ్జిపుండును పరీక్షించాలి, ఒకవేళ అది వ్యాపించకపోతే, అందులో పసుపురంగు వెంట్రుకలు లేకపోతే, చర్మంపై లోతుగా లేకపోతే,

  4. ఆ పురుషుడు గాని ఆ స్త్రీ గాని పుండు ఉన్న చోటు వదిలి క్షవరం చేసుకోవాలి క్షౌరం చేసుకోవచ్చు, యాజకుడు వారిని మరో ఏడు రోజులు వేరుగా ఉంచాలి.

  5. ఏడవ రోజు యాజకుడు ఆ గజ్జిపుండును పరీక్షించాలి, అది చర్మంపై వ్యాపించకుండ చర్మంపై లోతుగా లేకపోతే, యాజకుడు వారిని పవిత్రులని ప్రకటించాలి. వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, అప్పుడు వారు ఆచారరీత్య పవిత్రులవుతారు.

  6. కానీ వారు పవిత్రులని ప్రకటించిన తర్వాత ఒకవేళ గజ్జిపుండు వ్యాపిస్తే,

  7. యాజకుడు వారిని పరీక్షించి ఒకవేళ ఆ గజ్జిపుండు చర్మంపై వ్యాపించినట్లు కనబడితే, అతడు పసుపురంగు వెంట్రుకల కోసం చూడాల్సిన అవసరం లేదు; వారు అపవిత్రులు.

  8. ఒకవేళ, యాజకుడు చూసే వరకు ఆ పుండు అలాగే ఉండి, ఒకవేళ దానిపై నల్ల జుట్టు పెరిగితే, వారు బాగయ్యారని అర్థము. వారు శుభ్రంగా ఉన్నారు, యాజకుడు వారిని పవిత్రులని ప్రకటించాలి.

  9. “పురుషునికి గాని స్త్రీకి గాని చర్మంపై తెల్ల మచ్చలు ఉంటే,

  10. యాజకుడు వాటిని పరీక్షించాలి, ఒకవేళ ఆ మచ్చలు స్పష్టంగా కనబడక మామూలుగా ఉంటే, అవి చర్మం మీద వచ్చిన సాధారణ పొక్కులు, అవి హానికరం కావు; వారు ఆచారరీత్య పవిత్రులు.

  11. “తలవెంట్రుకలు రాలిపోయి బట్టతల ఉన్న పురుషుడు పవిత్రుడు.

  12. ఒకవేళ తల ముందు భాగంలో వెంట్రుకలు రాలిపోయి, నుదురు బోడిగా ఉంటే, అతడు పవిత్రుడు.

  13. అయితే అతని బట్టతలపై గాని లేదా నుదిటిపై గాని గులాబి రంగు పుండు ఉంటే, అది అతని తలమీద గాని నుదుటి మీద గాని ఏర్పడుతున్న తీవ్రమైన కుష్ఠువ్యాధి.

  14. యాజకుడు అతన్ని పరీక్షించాలి, ఒకవేళ అతని తలపై గాని నుదిటిపై వాచిన పుండు గులాబి రంగులో తీవ్రమైన కుష్ఠువ్యాధిలా ఉంటే,

  15. ఆ పురుషుడు వ్యాధిగ్రస్తుడు, అపవిత్రుడు. యాజకుడు అతని తలపై ఉన్న కుష్ఠువ్యాధిని బట్టి అతన్ని అపవిత్రునిగా ప్రకటించాలి.

  16. “రాళ్లు ఊడదీసి ఇంటి గోడలను గీయించి కొత్త అడుసు పూసిన తర్వాత ఇంట్లో అపవిత్రమైన మరక తిరిగి కనిపిస్తే,

  17. యాజకుడు వెళ్లి దానిని పరీక్షించాలి, ఒకవేళ ఇంట్లో మరక వ్యాపించి ఉంటే అది అపవిత్రపరచే మరక; ఆ ఇల్లు అపవిత్రమైనది.

  18. ఆ ఇంటిని దాని రాళ్లను కలపను అడుసును కూలగొట్టి వాటిని పట్టణం బయట ఉన్న అపవిత్రమైన ప్రదేశంలో పడవేయాలి.

  19. ఇంటిని శుద్ధి చేయడానికి అతడు రెండు పక్షులను కొంచెం దేవదారు కర్రను, ఎర్రని నూలును, హిస్సోపును తీసుకోవాలి.

  20. అతడు ఆ పక్షుల్లో ఒకదాన్ని మట్టికుండలో ఉన్న మంచినీటిపై చంపాలి.

  21. అప్పుడు అతడు దేవదారు కర్రను హిస్సోపును ఎర్రని నూలును బ్రతికి ఉన్న పక్షిని తీసుకుని చనిపోయిన పక్షి రక్తంలోను మంచినీటిలోను ముంచి ఆ ఇంట్లో ఏడుసార్లు చల్లాలి.

  22. అతడు ఇంటిని పక్షి రక్తంతోను మంచినీటితోను బ్రతికి ఉన్న పక్షితో దేవదారు కర్రతో హిస్సోపుతో ఎర్రని నూలుతో శుద్ధి చేయాలి.

  23. అప్పుడు అతడు బ్రతికి ఉన్న పక్షిని పట్టణం బయట ఉన్న పొలాల్లో వదలివేయాలి. ఈ విధంగా అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తం చేయాలి, అది శుద్ధి అవుతుంది.”

  24. “ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించే పవిత్రమైన అర్పణలను గౌరవించుమని అహరోనుతో అతని కుమారులతో చెప్పు, తద్వార వారు నా పవిత్ర నామాన్ని అపవిత్రం చేయకుండ ఉంటారు. నేను యెహోవాను.

  25. “వారితో ఇలా చెప్పు: ‘రాబోయే తరాలలో మీ వారసులలో ఎవరైనా ఆచారరీత్య అపవిత్రులై ఉండి ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించే పవిత్ర అర్పణల దగ్గరకు వస్తే, వారు నా సన్నిధిలో నుండి తొలగించబడాలి. నేను యెహోవాను.