Skip to content

Instruction గురించి బైబిల్ వచనాలు

179 వచనాలు · 2 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మీరు మంచివారు, మీరు మంచి చేస్తారు; మీ శాసనాలు నాకు బోధించండి.

  2. అహంకారులు నన్ను అబద్ధాలతో అరిచినప్పటికీ, నేను హృదయపూర్వకంగా మీ కట్టడలను అనుసరిస్తాను.

  3. వారి హృదయాలు క్రొవ్వులా మందగించాయి, కాని నేను మీ ధర్మశాస్త్రంలోనే ఆనందిస్తాను.

  4. నాకు బాధ కలగడం మేలైంది తద్వారా నేను మీ శాసనాలు నేర్చుకోగలను.

  5. వేలాది వెండి బంగారు నాణేలకంటే మీ నోట నుండి వచ్చిన ధర్మశాస్త్రం నాకు అమూల్యమైనది.

  6. మీ హస్తములు నన్ను నిర్మించి నన్ను రూపించాయి; మీ ఆజ్ఞలను నేర్చుకునేలా నాకు గ్రహింపును ఇవ్వండి.

  7. మీకు భయపడేవారు నన్ను చూసినప్పుడు సంతోషించుదురు గాక, ఎందుకంటే నేను మీ మాటలో నా నిరీక్షణ ఉంచాను.

  8. యెహోవా, మీ న్యాయవిధులు నీతిగలవని నాకు తెలుసు, నమ్మకత్వంలో మీరు నన్ను బాధించారని నాకు తెలుసు.

  9. మీ సేవకునికి మీరు ఇచ్చిన వాగ్దాన ప్రకారం, మీ మారని ప్రేమ నాకు ఆదరణ కలిగిస్తుంది.

  10. నేను బ్రతికేలా మీ కనికరం నా దగ్గరకు రానివ్వండి, మీ ధర్మశాస్త్రంలోనే నాకు ఆనందము.

  11. కారణం లేకుండా నాకు అన్యాయం చేసినందుకు అహంకారులు అవమానపరచబడుదురు గాక; కాని నేను మీ కట్టడలను ధ్యానిస్తాను.

  12. మీకు భయపడేవారు, మీ శాసనాలు గ్రహించేవారు నా వైపు తిరుగుదురు గాక.

  13. నేను అవమానానికి గురి కాకుండ, మీ శాసనాలను పూర్ణహృదయంతో అనుసరించి నిందారహితునిగా ఉంటాను.

  14. మీరు కలిగించే రక్షణ కోసం ఎదురుచూస్తూ నా ప్రాణం సొమ్మసిల్లి పోతుంది; కాని నేను మీ మాట మీద నిరీక్షణ కలిగి ఉన్నాను.

  15. మీ వాగ్దానం కోసం ఎదురుచూస్తూ నా కళ్లు క్షీణిస్తున్నాయి; “మీరు నన్ను ఎప్పుడు ఆదరిస్తారు?” అని నేను అంటాను.

  16. నేను పొగలో ఆరిన ద్రాక్ష తిత్తిలా ఉన్నా, నేను మీ శాసనాలను మరువను.

  17. మీ సేవకుడు ఎన్నాళ్ళు బ్రతుకుతాడు? నన్ను హింసించేవారిని మీరు ఎప్పుడు శిక్షిస్తారు?

  18. అహంకారులు మీ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా, నన్ను చిక్కించుకోడానికి గుంటలు త్రవ్వారు.

  19. మీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి; నేను నిష్కారణంగా హింసింపబడుచున్నాను, నాకు సహాయం చేయండి.

  20. వారు దాదాపు నన్ను ఈ భూమి మీద లేకుండ చేసేసారు, అయితే నేను మీ కట్టడలను విడిచిపెట్టలేదు.

  21. మీ మారని ప్రేమతో నా జీవితాన్ని కాపాడండి, తద్వార మీ నోటి శాసనాలను నేను పాటిస్తాను.

  22. యెహోవా! మీ వాక్కు శాశ్వతం; అది పరలోకంలో సుస్థిరంగా ఉంది.

  23. మీ నమ్మకత్వం తరతరాలకు నిలుస్తుంది. మీరు భూమిని స్థాపించారు, అది సుస్థిరంగా ఉంటుంది.

  24. మీ న్యాయవిధులు ఈ రోజు వరకు కొనసాగుతాయి, ఎందుకంటే అన్ని మీకు సేవ చేస్తాయి.

  25. ఒకవేళ మీ ధర్మశాస్త్రం నా ఆనందమై ఉండకపోతే, నేను బాధలో నశించి పోయి ఉండేవాన్ని.