Skip to content

Figurative Yoke గురించి బైబిల్ వచనాలు

14 వచనాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. ఈజిప్టువారికి ఇక మీరు బానిసలుగా ఉండకూడదని మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన మీ దేవుడనైన యెహోవాను నేనే; నేను మీ బానిసత్వ కాడి యొక్క పట్టీలను విరగ్గొట్టాను, మిమ్మల్ని తలలు పైకెత్తి నడిచేలా చేశాను.

  2. మిద్యాను ఓడిపోయిన రోజు జరిగినట్లు, వారికి భారం కలిగించే కాడిని వారి భుజాలమీద ఉన్న కర్రను, వారిని హింసించేవాని కర్రను మీరు విరిచివేశారు.

  3. ఆ రోజు వారి భుజాలపై నుండి వారి బరువు తీసివేయబడుతుంది, మీ మెడపై నుండి వారి కాడి కొట్టివేయబడుతుంది. మీరు బలంగా ఉన్నందుకు ఆ కాడి విరిగిపోతుంది.

  4. “చాలా కాలం క్రితమే నేను నీ కాడిని విరగ్గొట్టాను, నీ బంధకాలను తెంపివేశాను; అయినా నీవు, ‘నేను నీ సేవ చేయను!’ అన్నావు కాని నిజానికి, ప్రతీ ఎత్తైన కొండమీద, ప్రతీ పచ్చని చెట్టు క్రింద నీవు వేశ్యలా పడుకుంటున్నావు.

  5. కాబట్టి నేను నాయకుల దగ్గరకు వెళ్లి వారితో మాట్లాడతాను; ఖచ్చితంగా యెహోవా మార్గం వారికి తెలుసు, వారి దేవుడు ఏమి కోరుతున్నారో వారికి తెలుసు.” అయితే వారు కూడా ఏకమనస్సుతో కాడిని విరగ్గొట్టారు, బంధకాలను తెంపుకున్నారు.

  6. “ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘నేను బబులోను రాజు కాడిని విరగ్గొడతాను.

  7. నేను బబులోను రాజు కాడిని విరగ్గొట్టి, యూదా రాజును యెహోయాకీము కుమారుడునైన యెహోయాకీనును, బబులోనుకు బందీలుగా తీసుకువెళ్లిన యూదావారందరిని తిరిగి ఇక్కడకు రప్పిస్తాను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.”

  8. అప్పుడు ప్రవక్తయైన హనన్యా యిర్మీయా ప్రవక్త మెడలోని కాడిని తీసి, దాన్ని విరిచి,

  9. సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “ ‘ఆ రోజు, నేను వారి మెడల మీద ఉన్న కాడిని విరగ్గొడతాను వారి బంధకాలను తెంపివేస్తాను; ఇకపై విదేశీయులు వారిని బానిసలుగా చేయరు.

  10. “నా పాపాలు కాడికి కట్టబడ్డాయి; ఆయన చేతులతో అవి ఒక్కటిగా నేయబడ్డాయి. అవి నా మెడకు వ్రేలాడదీయబడ్డాయి, యెహోవా నా బలాన్ని విఫలం చేశారు. నేను తట్టుకోలేని వారి చేతుల్లోకి ఆయన నన్ను అప్పగించారు.

  11. ఒక మనిషి యవ్వన దశలో ఉన్నప్పుడే, కాడి మోయడం అతనికి మేలు.

  12. నేను సౌమ్యుడను, వినయ హృదయం గలవాడను కాబట్టి నా కాడి మీమీద ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీ ఆత్మలకు విశ్రాంతి దొరుకుతుంది.

  13. ఎందుకంటే, నా కాడి సుళువుగా మోయదగినది, నేను ఇచ్చే నా భారం తేలికైనది.”

  14. కాబట్టి ఇప్పుడు, మన పితరులు కానీ మనం కానీ మోయలేని కాడిని యూదేతరులలో నుండి వచ్చిన విశ్వాసుల మెడ మీద పెట్టి దేవుని శోధించవచ్చా? అలా చేయకూడదు!