కంటెంట్‌కు వెళ్లండి

Brother గురించి బైబిల్ వచనాలు: Brother's widow, law concerning Levirate marriage of

6 వచనాలు · 5 కోణాలు

Brother's widow, law concerning Levirate marriage of గురించి వచనాలు

  1. అన్నదమ్ములు కలిసి ఉమ్మడి కుటుంబంగా వుంటున్నప్పుడు వారిలో ఒకడు సంతానం లేకుండా చనిపోతే అతని భార్య పరాయివాడ్ని చేసుకోకూడదు, గతించిన తన భర్త తోబుట్టువు ఆమెను పెళ్ళి చేసుకోవాలి, ఆమె పట్ల బావమరిది విధిని నెరవేర్చాలి.

  2. ఆమె కనిన మొదటి కుమారుడు చనిపోయిన సోదరుడి పేరును కొనసాగించాలి, తద్వారా అతని పేరు ఇశ్రాయేలు నుండి తొలగించబడదు.

  3. ఏదేమైనా, ఒక వ్యక్తి తన సోదరుడి భార్యను పెళ్ళి చేసుకోకూడదనుకుంటే, ఆమె పట్టణ ద్వారం దగ్గర ఉన్న పెద్దల దగ్గరకు వెళ్లి, “నా భర్త సోదరుడు ఇశ్రాయేలీయులలో తన సోదరుని పేరును కొనసాగించడానికి నా నిరాకరిస్తున్నాడు. అతడు నా పట్ల ఒక బావమరిది కర్తవ్యాన్ని నెరవేర్చడం లేదు” అని చెప్పాలి.

  4. అప్పుడు పట్టణ పెద్దలు అతన్ని పిలిపించి మాట్లాడాలి. అప్పటికీ అతడు, “ఆమెను పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేదు” అని మొండిగా ఉంటే,

  5. అతని సోదరుని విధవరాలు పెద్దల సమక్షంలో అతని దగ్గరకు వెళ్లి, అతని కాలి చెప్పు ఊడదీసి అతని ముఖం మీద ఉమ్మివేసి, “తన సోదరుని కుటుంబాన్ని నిలబెట్టని వ్యక్తికి ఇలాగే జరుగుతుంది” అని చెప్పాలి.

  6. అప్పుడు వాని వంశం ఇశ్రాయేలులో చెప్పు ఊడదీయబడిన కుటుంబం అని పిలువబడుతుంది.