Skip to content

Birthright గురించి బైబిల్ వచనాలు

13 వచనాలు · 6 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. ఒక రోజు యాకోబు వంటకం చేస్తున్నపుడు, ఏశావు పొలం నుండి బాగా ఆకలితో వచ్చి,

  2. “నేను చాలా ఆకలితో ఉన్నాను, నీవు వండుచున్న ఆ ఎర్రని కూర కొంచెం నాకు పెట్టు!” అని అడిగాడు, (అందుకే అతనికి ఎదోము అని పేరు వచ్చింది.)

  3. యాకోబు, “అలా అయితే మొదట నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు అమ్ము” అని అన్నాడు.

  4. అప్పుడు ఏశావు, “నేను ఆకలితో చస్తూ ఉంటే నాకు జ్యేష్ఠత్వం దేనికి ఉపయోగం?” అని అన్నాడు.

  5. అయితే యాకోబు, “ముందు నాకు ప్రమాణం చేయి” అన్నాడు. కాబట్టి ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును యాకోబుకు అమ్మివేస్తున్నట్టుగా ప్రమాణం చేశాడు.

  6. అప్పుడు యాకోబు కొంత రొట్టె, కొంత కాయధాన్యం వంటకం ఏశావుకు ఇచ్చాడు. అతడు తిని త్రాగి లేచి వెళ్లిపోయాడు. ఈ విధంగా ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు.

  7. ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉంటే, అతడు ఒకరిని ప్రేమిస్తాడు, మరొకరిని ప్రేమించడు, ఇద్దరూ అతనికి కుమారులను కంటారు కాని జ్యేష్ఠ కుమారుడు అతడు ప్రేమించని భార్య కుమారుడు,

  8. అతడు తన కుమారులకు తన ఆస్తిని పంచినప్పుడు, నిజానికి జ్యేష్ఠ కుమారుడైన తాను ప్రేమించని భార్య కుమారుని స్థానంలో అతడు ప్రేమించే భార్య కుమారునికి జ్యేష్ఠత్వపు హక్కును ఇవ్వకూడదు.

  9. అతడు తనకున్న అన్నిటిలో రెట్టింపు వాటా ఇవ్వడం ద్వారా తాను ప్రేమించని భార్య కుమారుడిని జ్యేష్ఠ కుమారునిగా గుర్తించాలి. ఆ కుమారుడు తన తండ్రి శక్తికి మొదటి సంకేతము. జ్యేష్ఠత్వపు హక్కు అతనికి చెందినది.

  10. ఇశ్రాయేలు మొదటి కుమారుడైన రూబేను కుమారులు. (అతడు మొదటి కుమారుడు, కాని అతడు తన తండ్రి పడక ఎక్కి దాన్ని అపవిత్రం చేశాడు కాబట్టి, అతని జ్యేష్ఠత్వపు హక్కులు ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడ్డాయి; కాబట్టి జన్మహక్కుల ప్రకారం వంశావళిలో అతడు నమోదు కాలేదు.

  11. యూదా తన అన్నదమ్ములకంటే బలవంతుడు, అతని వంశంలో నుండి పరిపాలకుడు వచ్చాడు, అయినా కూడా జ్యేష్ఠత్వపు హక్కులు యోసేపుకు వచ్చాయి.)

  12. పిలుచువాని మూలంగా స్థిరంగా నిలబడడానికి, “పెద్దవాడు చిన్నవానికి సేవ చేస్తాడు” అని ఆమెతో చెప్పబడింది.

  13. “నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను” అని వ్రాయబడి ఉన్నది.