Skip to content

Apollos గురించి బైబిల్ వచనాలు

9 వచనాలు · 3 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. ఆ సమయంలో అలెక్సంద్రియ పట్టణానికి చెందిన అపొల్లో అనే ఒక యూదుడు ఎఫెసుకు వచ్చాడు. అతడు విద్యావంతుడు, లేఖనాల్లో పూర్తి ప్రవీణ్యత కలిగినవాడు.

  2. అతడు ప్రభువు మార్గం గురించి ఉపదేశాన్ని పొంది, తనకి యోహాను బాప్తిస్మం గురించి మాత్రమే తెలిసినప్పటికీ చాలా ఆసక్తితో యేసు గురించి స్పష్టంగా బోధిస్తున్నాడు.

  3. అతడు సమాజమందిరంలో ధైర్యంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అకుల ప్రిస్కిల్లలు అతని మాటలను విని, అతన్ని తమ ఇంటికి ఆహ్వానించి దేవుని మార్గం గురించి మరింత పూర్తిగా అతనికి వివరించారు.

  4. అపొల్లో అకాయ ప్రాంతానికి వెళ్లాలని తలంచినప్పుడు అక్కడి సహోదరి సహోదరులు అతన్ని ప్రోత్సహించి, అతన్ని చేర్చుకోవాలని అకాయలోని శిష్యులకు ఉత్తరాన్ని వ్రాసి పంపారు. అతడు అక్కడికి చేరినప్పుడు కృప చేత నమ్మిన వారికి అతడు గొప్ప సహాయంగా నిలిచాడు.

  5. ఎందుకంటే, అతడు లేఖనాల ఆధారంతో యేసే క్రీస్తు అని నిరూపిస్తూ తనకు వ్యతిరేకంగా ఉన్న యూదుల వాదనలను బహిరంగంగా గట్టిగా ఖండించాడు.

  6. మీలో, “నేను పౌలును అనుసరిస్తున్నాను” అని ఒకరు, “నేను అపొల్లోను అనుసరిస్తున్నాను” అని ఇంకొకరు చెప్పుకుంటూ ఉన్నప్పుడు మీరు సాధారణ మానవుల్లా లేరా?

  7. అపొల్లో ఎవరు? పౌలు ఎవరు? కేవలం సేవకులే కదా! ఒక్కొక్కరికి ప్రభువు నియమించిన దాని ప్రకారం, వారి ద్వారా మీరు విశ్వాసంలోనికి వచ్చారు.

  8. నేను విత్తనం నాటాను, అపొల్లో దానికి నీళ్లు పోశాడు, అయితే వృద్ధి కలుగచేసింది దేవుడే.

  9. కాబట్టి నాటేవారిలో కానీ, నీళ్లు పోసేవారిలో కానీ గొప్పతనం ఏమి లేదు, కానీ దేవుడే దానిని వృద్ధి చేయగలరు.