కంటెంట్‌కు వెళ్లండి

Abishai గురించి బైబిల్ వచనాలు: Seeks Saul's life

3 వచనాలు · 11 కోణాలు

"Abishai" కోసం వెతకండి

Seeks Saul's life గురించి వచనాలు

  1. అప్పుడు దావీదు, “శిబిరంలోనికి సౌలు దగ్గరకు నాతో పాటు ఎవరు వస్తారు?” అని హిత్తీయుడైన అహీమెలెకును సెరూయా కుమారుడైన యోవాబుకు సోదరుడైన అబీషైని అడిగాడు. అందుకు, “నీతో నేను వస్తాను” అని అబీషై అన్నాడు.

  2. దావీదు, అబీషై రాత్రివేళ ఆ సైన్యం దగ్గరకు వెళ్లినప్పుడు సౌలు శిబిరం లోపల పడుకుని నిద్రపోతున్నాడు. అతని ఈటె అతని తల దగ్గర నేలమీద గుచ్చి ఉంది. అబ్నేరు, సైన్యం అతని చుట్టూ పడుకుని ఉన్నారు.

  3. అప్పుడు అబీషై దావీదుతో, “దేవుడు ఈ రోజు నీ శత్రువును నీకప్పగించారు. కాబట్టి నీవు ఒప్పుకుంటే ఆ ఈటెతో ఒక పోటు పొడిచి నేనతడిని భూమిలో దిగేలా చేస్తాను, రెండవ పోటు పొడిచే అవసరం కూడా ఉండదు” అన్నాడు.