Skip to content
ప్రకటన 18:3-12

ప్రకటన 18:3-12

3
ఎందుకంటే ఆమె వ్యభిచార మద్యాన్ని త్రాగి దేశాలన్నీ మత్తులయ్యాయి. భూలోక రాజులు ఆమెతో వ్యభిచరించారు. భూలోక వర్తకులు ఆమె ఇచ్చే అధిక విలాసాలతో ధనికులయ్యారు.”
4
అప్పుడు పరలోకంలో నుండి మరొక స్వరం వినిపించింది: “ ‘నా ప్రజలారా! మీరు ఆమె పాపాల్లో భాగం పంచుకోకుండా’ ఆమెకు సంభవించే ఏ కీడు మీ మీదికి రాకుండా, ఆమెలో నుండి బయటకు రండి;
5
ఆమె చేసిన పాపాలు ఆకాశమంత ఎత్తుగా ఉన్నాయి కాబట్టి, దేవుడు ఆమె అతిక్రమాలను జ్ఞాపకం చేసుకున్నారు.
6
ఆమె ఎలా ఇచ్చిందో ఆమెకు అలాగే ఇవ్వండి; ఆమె చేసిన దానికి రెండింతలు ఆమెకు తిరిగి చెల్లించండి. ఆమె పాత్ర నుండే ఆమెకు రెండింతలు పోసి ఇవ్వండి!
7
ఆమె తనను తాను హెచ్చించుకొంటూ ఎన్ని సుఖభోగాలు అనుభవించిందో, అంత వేదన దుఃఖాన్ని ఆమెకు కలుగజేయండి. ఎందుకంటే, ఆమె తన హృదయంలో, ‘నేను రాణిగా నా సింహాసనం మీద కూర్చున్నాను. నేను విధవరాలిని కాను, ఇక ఎన్నడు సంతాపం అనుభవించను’ అని అనుకుంది.
8
కాబట్టి ఒక్క రోజులోనే ఆమె తెగుళ్ళన్ని ఆమెను పట్టుకుంటాయి, ఆమె మీదికి మరణం, దుఃఖం, కరువు వస్తాయి. ఆమెకు తీర్పు తీర్చే ప్రభువైన దేవుడు శక్తిగలవాడు, కాబట్టి ఆమె అగ్నితో కాల్చివేయబడుతుంది.”
9
ఆమెతో వ్యభిచరించి ఆమె సుఖభోగాలను అనుభవించిన భూ రాజులు ఆమె కాలుతున్నప్పుడు వచ్చే పొగను చూసి ఆమె కోసం కన్నీరు కారుస్తూ దుఃఖిస్తారు.
10
ఆమె పడే వేదన చూసి భయపడి, వారు దూరంగా నిలబడి ఇలా రోదిస్తారు: “మహా పట్టణమా! నీకు శ్రమ! శ్రమ! బబులోను మహా పట్టణమా, ఒక్క గంటలోనే నీ మీదికి శిక్ష వచ్చింది.”
11
భూలోక వ్యాపారులు ఇకపై తమ సరుకులు కొనేవారెవరు లేరని ఆమె కోసం కన్నీరు కారుస్తూ దుఃఖిస్తారు.
12
వారి సరుకులు ఏవంటే బంగారం, వెండి, విలువైన రాళ్లు, ముత్యాలు; సన్నని నారబట్టలు, ఊదా రంగు బట్టలు, పట్టు బట్టలు, ఎర్రని బట్టలు; సువాసన ఇచ్చే అన్ని రకాల చెక్కలు, దంతాలతో చాలా విలువైన చెక్కతో ఇత్తడి ఇనుము నునుపురాళ్లతో తయారుచేసిన అన్ని రకాల వస్తువులు;
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options