Skip to content
కీర్తనలు 119:43-67

కీర్తనలు 119:43-67

43
మీ సత్య వాక్యాన్ని ఎప్పుడూ నా నోటి నుండి తీసివేయకండి, ఎందుకంటే నేను మీ న్యాయవిధులలో నా నిరీక్షణ ఉంచాను.
44
నేను ఎల్లప్పుడు అంటే నిరంతరం, మీ ధర్మశాస్త్రానికి లోబడతాను.
45
నేను మీ కట్టడలను వెదికాను, కాబట్టి స్వేచ్ఛలో నడుచుకుంటాను.
46
రాజుల ఎదుట కూడా నేను మీ శాసనాల గురించి మాట్లాడతాను నేను సిగ్గుపడను,
47
నేను మీ ఆజ్ఞలలో ఆనందిస్తాను ఎందుకంటే అవంటే నాకు ప్రేమ.
48
నేను ప్రేమించే మీ ఆజ్ఞల వైపు నా చేతులెత్తుతాను, తద్వారా నేను మీ శాసనాలను ధ్యానిస్తాను.
49
మీ సేవకునికి మీరిచ్చిన మాట జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే మీరు నాకు నిరీక్షణ కలిగించారు.
50
నా శ్రమలో నా ఆదరణ ఇదే: మీ వాగ్దానం నన్ను బ్రతికిస్తుంది.
51
అహంకారులు కనికరం లేకుండా నన్ను ఎగతాళి చేస్తున్నారు, కాని నేను మీ ధర్మశాస్త్రం నుండి తిరిగిపోను.
52
యెహోవా, మీ అనాది న్యాయవిధులు నాకు జ్ఞాపకం ఉన్నాయి, వాటిలో నాకెంతో ఆదరణ.
53
మీ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టిన దుష్టులను బట్టి, నాకు చాలా కోపం వస్తుంది.
54
నేను ఎక్కడ బస చేసినా మీ శాసనాలే నా పాటల సారాంశము.
55
యెహోవా, నేను నీ ధర్మశాస్త్రాన్ని పాటించడానికి రాత్రివేళ మీ పేరును జ్ఞాపకం చేసుకుంటున్నాను.
56
నేను మీ కట్టడలకు విధేయత చూపుతాను ఇది నాకు అభ్యాసంగా ఉన్నది.
57
యెహోవా, మీరే నా వాటా; మీ మాటలకు లోబడతానని నేను మాటిచ్చాను.
58
నేను నా హృదయపూర్వకంగా మీ దయ కోసం వెదికాను; మీ వాగ్దానం మేరకు నా మీద దయచూపండి.
59
నేను నా మార్గాలను గమనించి నా అడుగులను మీ శాసనాల వైపుకు త్రిప్పుకున్నాను.
60
మీ ఆజ్ఞలను అనుసరించడానికి నేను ఆలస్యం చేయకుండ త్వరపడతాను.
61
దుష్టులు నన్ను త్రాళ్లతో ఉచ్చులా బిగించినా, నేను మీ ధర్మశాస్త్రం మరచిపోను.
62
మీ నీతిగల న్యాయవిధులను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించడానికి నేను మధ్యరాత్రి లేస్తున్నాను.
63
మీకు భయపడేవారందరికి, మీ కట్టడలను అనుసరించే వారందరికి నేను స్నేహితుడను.
64
యెహోవా, ఈ లోకమంతా మీ మారని ప్రేమ చేత నిండి ఉంది; మీ శాసనాలు నాకు బోధించండి.
65
యెహోవా, మీ మాట ప్రకారం మీ సేవకునికి మేలు చేయండి.
66
నేను మీ ఆజ్ఞలను నమ్ముకున్నాను, నాకు సరియైన వివేచనను గ్రహింపును బోధించండి.
67
నాకు బాధ కలుగకముందు నేను త్రోవ తప్పి తిరిగాను, కాని ఇప్పుడు నేను మీ వాక్కుకు లోబడుతున్నాను.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options