Skip to content
సామెతలు 30:15-31

సామెతలు 30:15-31

15
“జలగకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వారు ‘ఇవ్వు, ఇవ్వు!’ అని అరుస్తారు. “తృప్తిలేనివి మూడు కలవు, ‘చాలు!’ అననివి నాలుగు కలవు:
16
అవి ఏమనగా పాతాళం, పిల్లలు కనని గర్భం; నీరు చాలు అనని భూమి నీరు చాలు అనని అగ్ని.
17
“తండ్రిని ఎగతాళి చేసి తల్లి మాట వినని వాని కన్ను లోయకాకులు పీకుతాయి పక్షిరాజు పిల్లలు దానిని తింటాయి.
18
“మూడు అద్భుతమైనవి కలవు, నాకు అర్థం కానివి నాలుగు కలవు:
19
అవేమనగా ఆకాశాన గ్రద్ద జాడ, బండ మీద పాము జాడ, అగాధ సముద్రంలో ఓడ నడుచు జాడ, పెండ్లికాని స్త్రీతో పురుషుని జాడ.
20
“వేశ్య యొక్క పనియు అట్టిదే; అది తిని నోరు తుడుచుకుని నేను ఏ చెడు చేయలేదు అని అంటుంది.
21
“భూమిని వణికించునవి మూడు కలవు, అవి భరించలేనివి నాలుగు కలవు.
22
అవి ఏమనగా రాజరికానికి వచ్చిన దాసుడు, తినడానికి పుష్కలంగా ఉన్న దైవభక్తి లేని మూర్ఖుడు,
23
పెళ్ళి చేసుకున్న ధిక్కార స్త్రీ, యజమానురాలి స్థానాన్ని తీసుకున్న చేసికొన్న దాసి.
24
“భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినా అవి మిక్కిలి తెలివిగలవి.
25
చీమలు బలంలేని ప్రాణులైనా, అవి ఎండాకాలంలో ఆహారం కూర్చుకుంటాయి.
26
చిన్న కుందేళ్ళు బలంలేని ప్రాణులైనా, అవి బండ సందుల్లో నివాసాలు ఏర్పరచుకుంటాయి.
27
మిడతలకు రాజు లేడు, అయినా అవి బారులు తీరి సాగిపోతాయి.
28
బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినా రాజుల ఇండ్లలో అది ఉంటుంది.
29
“డంబంగా నడిచేవి మూడు కలవు, బడాయిగా నడిచేవి నాలుగు కలవు:
30
సింహం, మృగాలలో బలమైనది, దేని ముందు వెనక్కితగ్గనిది.
31
కోడిపుంజు, మేకపోతు తన సైన్యానికి ముందు నడుచుచున్న రాజు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options