Skip to content
సామెతలు 22:1-16

సామెతలు 22:1-16

1
గొప్ప సంపద కంటే మంచి పేరు ఎక్కువ కోరదగినది వెండి బంగారం కంటే దయ ఎక్కువ ఘనపరచదగినవి.
2
ధనికులు పేదవారు దీనిని సాధారణంగా కలిగి ఉంటారు: వారందరిని కలుగజేసినవాడు యెహోవా.
3
వివేకి ఆపదను చూసి ముందు జాగ్రత్తలు తీసుకుంటాడు, సామాన్యుడు గ్రుడ్డిగా ముందుకు వెళ్లి తగిన మూల్యం చెల్లిస్తాడు.
4
యెహోవాయందలి భయం వినయం; ఐశ్వర్యం గౌరవం దీర్ఘాయువు దాని వేతనాలు.
5
దుష్టుల మార్గాల్లో వలలు, ఆపదలు ఉన్నాయి, అయితే తమ ప్రాణాలు కాపాడుకునేవారు వాటికి దూరముగా ఉంటారు.
6
మీ పిల్లలను సరియైన మార్గంలో నడవమని నేర్పించండి, వారు పెద్దవారయ్యాక కూడా దాని నుండి తొలగిపోరు.
7
ధనవంతుడు బీదల మీద పెత్తనము చేస్తాడు, అప్పుచేసేవాడు అప్పిచ్చినవానికి బానిస.
8
దుర్మార్గాన్ని విత్తేవాడు కీడు అనే పంటను కోస్తాడు, వారి భీభత్స పాలన అంతం అవుతుంది.
9
ధారాళంగా ఉన్నవారు ధన్యులు, ఎందుకంటే వారు బీదలను పోషిస్తారు.
10
ఎగతాళి చేసేవాన్ని తోలివేస్తే కలహాలు తొలగిపోతాయి; తగాదాలు అవమానాలు ముగిశాయి.
11
శుద్ధహృదయాన్ని ప్రేమించేవాడు దయ గల మాటలు మాట్లాడేవాడు రాజును స్నేహితునిగా కలిగి ఉంటాడు.
12
యెహోవా కళ్లు తెలివిని గమనిస్తూ ఉంటాయి, కాని విశ్వాసం లేనివారి మాటలను ఆయన నిరాశపరుస్తారు.
13
సోమరి అంటాడు, “బయట సింహమున్నది! వీధుల్లో నేను చంపబడతాను!”
14
వ్యభిచార స్త్రీ నోరు ఒక లోతైన గుంట; యెహోవా ఉగ్రత క్రింద ఉన్నవాడు దానిలో పడతాడు.
15
యవ్వనస్థుని హృదయంలో బుద్ధిహీనత ఉంటుంది, క్రమశిక్షణ దండము దానిని వానిలో నుండి దూరంగా తొలగిస్తుంది.
16
లాభము పొందాలని పేదవారికి అన్యాయం చేసేవారికి ధనవంతులకు బహుమానాలు ఇచ్చేవానికి నష్టమే కలుగుతుంది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options