సామెతలు 20:13-19
13
నిద్రను ప్రేమించకు దరిద్రుడవవుతావు; నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారం మిగులుతుంది.
14
కొనేవాడు, “అది బాగోలేదు ఇది బాగోలేదు” అని అంటూ బేరమాడతాడు కాని కొన్న తర్వాత తాను బేరమాడిన దాన్ని గురించి గొప్పగా చెప్పుకుంటాడు.
15
బంగారం ఉంది సమృద్ధిగా ముత్యాలు ఉన్నాయి, కాని తెలివితో మాట్లాడే పెదవులు అరుదైన ఆభరణం.
16
అపరిచితునికి భద్రత కల్పించే వ్యక్తి యొక్క వస్త్రాన్ని తీసుకోండి; ఒకవేళ అది బయటి వ్యక్తి కోసం చేస్తే దానిని ప్రతిజ్ఞలో ఉంచండి.
17
మోసం చేసి తెచ్చుకున్న ఆహారం మనుష్యులకు బహు తీపిగా ఉంటుంది. తర్వాత వాని నోరు మట్టితో నింపబడుతుంది.
18
ప్రణాళికలు ఆలోచనచేత బలపరచబడతాయి, మంచిచెడులనెరిగిన నాయకుడవై పోరాడాలి.
19
పుకార్లు చెప్తూ తిరిగేవారు నమ్మకద్రోహం చేసేవారు కాబట్టి ఎక్కువగా మాట్లాడేవారిని దూరం ఉంచాలి.
Settings