Skip to content
సామెతలు 20:20-25

కుటుంబ ధర్మం మరియు దైవ సార్వభౌమత్వం

సామెతలు 20:20-25
20
తన తండ్రినైనను తల్లినైనను తిట్టేవాని దీపం కటిక చీకటిలో ఆరిపోతుంది.
21
జీవితంలో చాలా త్వరగా పొందిన వారసత్వం అంతంలో దీవించబడదు.
22
కీడుకు తిరిగి కీడు చేయాలనుకోవద్దు, యెహోవా కోసం వేచియుండు ఆయన నిన్ను రక్షిస్తారు.
23
మోసపు తూనిక రాళ్లు యెహోవాకు అసహ్యం, దొంగత్రాసు ఆయనకు అయిష్టం.
24
ఒక వ్యక్తి అడుగులను నిర్దేశించేవారు యెహోవా, అలాంటప్పుడు తమ మార్గాన్ని వారు ఎట్లు గ్రహించగలరు?
25
మనుష్యులు తొందరపడి దేవునికి మ్రొక్కుబడి చేయడం ఒక ఉచ్చులాంటిది, తర్వాత తెలుస్తుంది దాని మూల్యం ఎంత అనేది.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options