Skip to content
సామెతలు 20:1-6

సామెతలు 20:1-6

1
మద్యం సేవించేవారు అపహాసకులు బీరు సేవించేవారు కలహప్రియులు; వాటి ద్వార తూలేవారు జ్ఞానం లేనివారు.
2
రాజు వలన కలుగు భయము సింహగర్జన వంటిది; రాజునకు కోపం పుట్టించు వారు తమకు ప్రాణహాని తెచ్చుకుంటారు.
3
తగవులకు దూరముగా ఉండడం మనుష్యులకు ఘనత, మూర్ఖులు జగడాన్నే కోరును.
4
విత్తనం వేసే సమయంలో సోమరి దున్నడు; కోత సమయంలో పంటను గురించి వాడు తెలుసుకునేసరికి వానికేమియు ఉండదు.
5
మనిషి హృదయంలోని ఆలోచన లోతైన నీళ్ల వంటిది, వివేకం గలవాడు దాన్ని పైకి చేదుకుంటాడు.
6
తమకు ఎడతెగని ప్రేమ ఉందని చాలామంది చెప్పుకుంటారు, కానీ నమ్మకమైన మనుష్యులు ఎవరికి కనబడతారు?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options