మూర్ఖులు మరియు అపహాసకులతో వ్యవహరించడం
25
ఎగతాళి చేసేవారు శిక్షింపబడగా చూసి సామాన్యులు వివేకం నేర్చుకుంటారు; మంచిచెడులు నెరిగిన వారిని గద్దింపగా వారు తెలివిని అభివృద్ధి చేసికొందురు.
26
తండ్రిని దోచుకునేవాడు, తల్లిని వెళ్లగొట్టేవాడు, అవమానాన్ని అపకీర్తిని కలుగజేసేవాడు.
27
నా కుమారుడా, ఒకవేళ నీవు ఉపదేశాన్ని వినుట మానిన ఎడల, నీవు తెలివిగల మాటల నుండి తప్పిపోతావు.
28
అవినీతిపరుడైన సాక్షి న్యాయాన్ని ఎగతాళి చేస్తాడు, దుష్టుల నోరు పాపాన్ని జుర్రుకొంటుంది.
29
హేళన చేయువారికి తీర్పులును బుద్ధిలేని వారి వీపులకు దెబ్బలను ఏర్పాటు చేయబడినవి.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.