సామెతలు 19:20-24
20
నీవు ముందుకు జ్ఞానివగుటకై, ఆలోచన విని బోధను అంగీకరించు.
21
ఒక వ్యక్తి హృదయంలో ఆలోచనలు అనేకంగా పుడతాయి, అయితే యెహోవా ఉద్దేశమే స్థిరము.
22
ఒక వ్యక్తి కోరుకునేది నమ్మకమైన ప్రేమను, అబద్ధికునిగా కంటే పేదవానిగా ఉండడం మేలు.
23
యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం జీవమునకు దారి; అది కలిగినవాడు తృప్తి కలిగినవాడై అపాయం లేకుండా బ్రతుకును.
24
సోమరి పాత్రలో చేయి ముంచునేగాని; తన నోటికి దాని తిరిగి ఎత్తనైనా ఎత్తడు.
Settings