Skip to content
సంఖ్యాకాండము 22:34-39

సంఖ్యాకాండము 22:34-39

34
బిలాము యెహోవా దూతతో, “నేను పాపం చేశాను. నన్ను ఎదుర్కోడానికి నీవు దారికి అడ్డుగా నిలబడ్డావని నేను గ్రహించలేదు. ఇప్పుడు నీకు ఇష్టం లేకపోతే నేను తిరిగి ఇంటికి వెళ్లిపోతాను” అని అన్నాడు.
35
యెహోవా దూత బిలాముతో, “వారితో వెళ్లు కానీ నేను చెప్పేదే నీవు పలకాలి” అని అన్నాడు. కాబట్టి బిలాము బాలాకు అధికారులతో వెళ్లాడు.
36
బిలాము వస్తున్నాడని విని బాలాకు అర్నోను నది సరిహద్దులో ఉన్న మోయాబు పట్టణం పొలిమేరలో అతన్ని కలసుకోడానికి వెళ్లాడు.
37
బాలాకు బిలాముతో, “నిన్ను త్వరగా రమ్మని చెప్పలేదా? నా దగ్గరకు ఎందుకు రాలేదు? నేను నీకు ఘనత ఇవ్వలేనా?” అని అన్నాడు.
38
“ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను కదా” అని బిలాము జవాబిచ్చాడు. “కానీ నాకిష్టమైనది నేను చెప్పలేను. దేవుడు నా నోట్లో పెట్టిందే నేను చెప్పాలి” అని బాలాకుతో అన్నాడు.
39
తర్వాత బిలాము బాలాకు వెంట కిర్యత్-హుచ్చోతుకు వెళ్లాడు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options