కంటెంట్‌కు వెళ్లండి
నెహెమ్యా 3:15-27

తూర్పు గోడ వెంట మరమ్మత్తులు

నెహెమ్యా 3:15-27
15
నీటి ఊట గుమ్మాన్ని మిస్పా ప్రదేశానికి అధిపతియైన కొల్-హోజె కుమారుడైన షల్లూము బాగుచేశాడు. అతడు దానిని బాగుచేసి పైకప్పు వేసి తలుపులు నిలబెట్టి తాళాలు గడియలు అమర్చాడు. అంతే కాకుండా దావీదు పట్టణం నుండి క్రిందకు వెళ్లే మెట్ల వరకు రాజుగారి తోట దగ్గర సిలోయము కొలను గోడను అతడే నిర్మించాడు.
16
అతని ప్రక్క భాగం నుండి దావీదు సమాధులకు ఎదురుగా ఉన్న ప్రాంతం వరకు కట్టి ఉన్న కోనేరు వరకు, యుద్ధవీరుల ఇళ్ళ వరకు బేత్-సూరులో సగభాగానికి అధిపతియైన అజ్బూకు కుమారుడైన నెహెమ్యా బాగుచేశాడు.
17
అతని ప్రక్కనే లేవీయులలో బానీ కుమారుడైన రెహూము బాగుచేశాడు. అతని తర్వాతి భాగాన్ని కెయీలాలో సగభాగానికి అధిపతియైన హషబ్యా బాగుచేశాడు.
18
అతని ప్రక్క భాగాన్ని వారి బంధువులైన హేనాదాదు కుమారుడైన బవ్వై బాగుచేశాడు. అతడు కెయీలాలో సగభాగానికి అధిపతిగా ఉన్నాడు.
19
అతని తర్వాతి భాగాన్ని ఆయుధశాల మార్గానికి ఎదురుగా ఉన్న గోడ మలుపు ప్రక్కన మరొక భాగాన్ని మిస్పాకు అధిపతి యెషూవ కుమారుడైన ఏజెరు బాగుచేశాడు.
20
అతని ప్రక్కనే ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటి గుమ్మం వరకు జక్కయి కుమారుడైన జబ్బయి కుమారుడైన బారూకు ఆసక్తిగా పని చేశాడు
21
ఆ ప్రక్కనే మరొక భాగాన్ని ఎల్యాషీబు ఇంటి గుమ్మం నుండి ఆ ఇంటి చివరి వరకు హక్కోజుకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు బాగుచేశాడు.
22
అతని ప్రక్కనే చుట్టుప్రక్కల ఉన్న యాజకులు బాగుచేశారు.
23
వారి ప్రక్కనే బెన్యామీను హష్షూబు అనేవారు తమ ఇంటి ఎదుట ఉన్న భాగాన్ని మరమ్మత్తు చేశారు. వారి ప్రక్కనే అనన్యాకు పుట్టిన మయశేయా కుమారుడైన అజర్యా తన ఇంటి ప్రక్కన ఉన్న భాగాన్ని బాగుచేశాడు.
24
అతని ప్రక్కనే అజర్యా ఇంటి నుండి గోడ మలుపు మూల వరకు ఉన్న భాగాన్ని హేనాదాదు కుమారుడైన బిన్నూయి బాగుచేశాడు.
25
ఆ ప్రక్క భాగాన్ని గోడ మలుపు తిరిగిన చోట చెరసాల దగ్గర రాజభవనం ఉండే మహా గోపురం వరకు ఊజై కుమారుడైన పాలాలు బాగుచేశాడు. దాని ప్రక్కన పరోషు కుమారుడైన పెదాయా బాగుచేశాడు.
26
ఓఫెలులో నివసిస్తున్న ఆలయ సేవకులు తూర్పున ఉన్న నీటిగుమ్మం ప్రక్కన, గోపురం దగ్గర బాగుచేశారు.
27
వారి తర్వాతి భాగాన్ని, గొప్ప గోపురానికి ఎదురుగా ఉన్న భాగం నుండి ఓఫెలు గోడ వరకు తెకోవాకు చెందినవారు బాగుచేశారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options