Skip to content
నెహెమ్యా 3:28-32

చుట్టుగోడ పూర్తి: గుర్రాల ద్వారం నుండి గొర్రెల ద్వారం వరకు

నెహెమ్యా 3:28-32
28
గుర్రపు గుమ్మానికి పైన తమ ఇళ్ళకు ఎదురుగా ఉన్న భాగాలను యాజకులందరు బాగుచేశారు.
29
వారి తర్వాత తన ఇంటికి ఎదురుగా ఉన్న భాగాన్ని ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగుచేశాడు. ఆ ప్రక్క భాగాన్ని తూర్పు గుమ్మాన్ని కాపలా కాసే షెకన్యా కుమారుడైన షెమయా బాగుచేశాడు.
30
ఆ తర్వాత షెలెమ్యా కుమారుడైన హనన్యా, జాలాపు ఆరవ కుమారుడైన హానూను మరొక భాగాన్ని బాగుచేశారు. వారి తర్వాత తన గదికి ఎదురుగా ఉన్న భాగాన్ని బెరెక్యా కుమారుడైన మెషుల్లాము బాగుచేశాడు.
31
అతని ప్రక్కనే ఆలయ సేవకుల ఇంటి నుండి, పరిశీలన గుమ్మానికి ఎదురుగా ఉన్న వ్యాపార కూడలి మూల వరకు కంసాలివాడైన మల్కీయా బాగుచేశాడు.
32
మూలన ఉన్న పై గది నుండి గొర్రెల గుమ్మం మధ్య వరకు కంసాలివారు, వ్యాపారులు బాగుచేశారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options