Skip to content
న్యాయాధిపతులు 9:45-57

న్యాయాధిపతులు 9:45-57

45
ఆ రోజంతా అబీమెలెకు పట్టణంపై దాడి చేసి, ముట్టడిచేసి, దాని ప్రజలను చంపాడు. తర్వాత పట్టణాన్ని నాశనం చేసి దానిపై ఉప్పు చల్లాడు.
46
ఈ వార్త విని, షెకెము గోపుర పౌరులు ఏల్-బెరీతు గుడి యొక్క కోటలోనికి చొరబడ్డారు.
47
షెకెము గోపుర పౌరులు అక్కడ గుమికూడారని అబీమెలెకు విన్నప్పుడు,
48
అతడు, అతనితో ఉన్న మనుష్యులందరు, సల్మోను కొండ ఎక్కారు. అబీమెలెకు ఒక గొడ్డలి తీసుకుని కొన్ని కొమ్మలను నరికి, తన భుజంపై పెట్టుకున్నాడు. తన మనుష్యులను ఆదేశిస్తూ, “త్వరపడండి! నేను ఏమి చేస్తున్నానో అదే మీరు చేయండి!” అన్నాడు.
49
కాబట్టి ఆ మనుష్యులందరు కొమ్మలు నరికి అబీమెలెకును వెంబడించారు. వారు బలమైన కోటను ముట్టడిచేసి ప్రజలు అందులో ఉన్నప్పుడే దానిని కాల్చారు. కాబట్టి షెకెము గోపురంలో ఉన్న దాదాపు వేయిమంది పురుషులు స్త్రీలు చనిపోయారు.
50
తర్వాత అబీమెలెకు తేబేసుకు వెళ్లి దాని మీద దాడి చేసి దానిని వశపరచుకున్నాడు.
51
అయితే ఆ పట్టణం మధ్యలో బలమైన గోపురం ఉంది. స్త్రీలు, పురుషులు, నాయకులు అందరు దానిలోకి వెళ్లారు. వారు లోనికి వెళ్లి, తాళం వేసుకుని గోపురం కప్పుమీదికి ఎక్కారు.
52
అబీమెలెకు ఆ గోపురం దగ్గరకు వెళ్లి, దానిపై దాడి చేసి దాన్ని కాల్చివేయడానికి ఆ గోపుర ద్వారం దగ్గరకు వెళ్లినప్పుడు,
53
ఒక స్త్రీ అబీమెలెకు తలమీద తిరగలి రాతిని పడవేయడంతో అతని కపాలం పగిలింది.
54
అతడు తన ఆయుధాలు మోసేవాన్ని కంగారుగా పిలిచి, “ ‘అబీమెలెకును ఒక స్త్రీ చంపింది’ అని ఎవరూ చెప్పుకోకుండా నీ కత్తి తీసి నన్ను చంపు” అన్నాడు. కాబట్టి అతని దాసుడు అతన్ని పొడవగా అతడు చనిపోయాడు.
55
అబీమెలెకు చనిపోయాడని ఇశ్రాయేలీయులు చూసి తమ గృహాలకు వెళ్లారు.
56
ఈ విధంగా అబీమెలెకు తన డెబ్బైమంది సోదరులను చంపి తన తండ్రికి చేసిన ద్రోహాన్ని దేవుడు తిరిగి అతని మీదికి రప్పించారు.
57
అంతేకాదు, షెకెము వారు కూడా తమ చెడు కార్యాలన్నిటికి వెల చెల్లించేలా దేవుడు చేశారు. యెరుబ్-బయలు కుమారుడైన యోతాము శాపం వారి మీదికి వచ్చింది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options