న్యాయాధిపతులు 5:1-11
1
ఆ రోజు దెబోరా, అబీనోయము కుమారుడైన బారాకు ఈ పాట పాడారు:
2
ఇశ్రాయేలులో నాయకులు నాయకత్వం వహించినపుడు, ప్రజలు స్వచ్ఛందంగా అర్పించుకున్నప్పుడు, యెహోవాను స్తుతించండి!
3
రాజులారా వినండి! అధికారులారా ఆలకించండి! నేను యెహోవాకు కీర్తన పాడతాను, నేను పాడతాను; ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తనలో స్తుతిస్తాను.
4
యెహోవా, మీరు శేయీరు నుండి బయలుదేరినప్పుడు, మీరు ఎదోము ప్రాంతం నుండి బయలుదేరినప్పుడు, భూమి కంపించింది, ఆకాశం కుమ్మరించింది, మేఘాలు నీళ్లు కుమ్మరించాయి.
5
అద్వితీయుడైన యెహోవా ఎదుట పర్వతాలు కంపించాయి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఎదుట సీనాయి కంపించింది.
6
అనాతు కుమారుడైన షమ్గరు రోజుల్లో, యాయేలు రోజుల్లో రాజమార్గాలు నిర్జనమయ్యాయి; ప్రయాణికులు ప్రక్క త్రోవల్లో నడిచారు.
7
ఇశ్రాయేలులో ఉన్న గ్రామస్థులు పోరాడలేరు; దెబోరా అనే నేను లేచేవరకు, ఇశ్రాయేలులో తల్లిగా నేను లేచేవరకు వారు వెనకడుగు వేశారు.
8
ఇశ్రాయేలీయులు కొత్త దేవుళ్ళను ఎంచుకున్నారు, యుద్ధం పట్టణ ద్వారాల దగ్గరకు వచ్చింది, కాని నలభై వేలమంది ఇశ్రాయేలీయులలో ఒక డాలు గాని ఈటె గాని కనిపించలేదు.
9
నా హృదయం ఇశ్రాయేలు నాయకులతో, యుద్ధానికి స్వచ్ఛందంగా వచ్చిన వారితో ఉన్నది. యెహోవాను స్తుతించండి!
10
తెల్ల గాడిదల మీద స్వారీ చేసేవారలారా, తివాచీల మీద కూర్చునే వారలారా, త్రోవలో నడిచే వారలారా, ఇది గమనించండి!
11
పశువులు నీళ్లు త్రాగే చోట గాయకులు చేసే స్వరాన్ని వినండి. వారు యెహోవా నీతిక్రియల గురించి, ఇశ్రాయేలులో ఆయన యొక్క గ్రామస్థుల జయాల గురించి చెప్తున్నారు. “అప్పుడు యెహోవా ప్రజలు పట్టణ ద్వారాల దగ్గరకు వెళ్లారు.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.
Settings