Skip to content
న్యాయాధిపతులు 5:12-18

ఇశ్రాయేలు గోత్రాలను సమీకరించుట

న్యాయాధిపతులు 5:12-18
12
‘మేలుకో, మేలుకో, దెబోరా! మేలుకో, మేలుకో, కీర్తన పాడు! బారాకూ లే! అబీనోయము కుమారుడా, చెరపట్టిన వారిని చెరపట్టు.’
13
“ప్రాణాలతో మిగిలిన అధిపతులు వచ్చారు; శూరులకు వ్యతిరేకంగా యెహోవా ప్రజలు నా దగ్గరకు వచ్చారు.
14
కొందరు అమాలేకులో స్థిరపడినవారు ఎఫ్రాయిం నుండి వచ్చారు; నీ వెంట వచ్చిన వారిలో బెన్యామీను వారు ఉన్నారు. మాకీరు నుండి అధిపతులు వచ్చారు, జెబూలూను నుండి అధికారుల దండం మోసేవారు వచ్చారు.
15
ఇశ్శాఖారు అధిపతులు దెబోరాతో ఉన్నారు; ఇశ్శాఖారు మనుష్యులు బారాకుతో ఉన్నారు, అతని ఆదేశాన్ని బట్టి లోయలోనికి పంపబడ్డారు. రూబేను ప్రాంతాల్లో తీవ్ర హృదయాన్వేషణ కలిగింది.
16
గొర్రెల మందల కోసం వేసే ఈలలు వినడానికి నీవెందుకు గొర్రెల దొడ్ల మధ్య ఉన్నావు? రూబేను ప్రాంతాల్లో తీవ్ర హృదయాన్వేషణ కలిగింది.
17
గిలాదువారు యొర్దాను అవతల నివసించారు. దానీయులు ఓడల దగ్గర ఎందుకు తిరుగుతున్నారు? ఆషేరీయులు సముద్రతీరాన తమ ఓడరేవుల్లో ఉన్నారు.
18
జెబూలూను ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టుకున్నారు; యుద్ధభూమిలో నఫ్తాలి ప్రజలు కూడా అలాగే చేశారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options