న్యాయాధిపతులు 20:12-17
12
ఇశ్రాయేలు గోత్రాల వారు బెన్యామీను గోత్రమంతటికి దూతలను పంపి అన్నారు, “మీ మధ్య జరిగిన ఈ నీచమైన నేరం సంగతి ఏమిటి?
13
ఇప్పుడు గిబియాలో ఉన్న ఆ దుష్టులను అప్పగించండి, మేము వారిని చంపి ఇశ్రాయేలులో ఈ దుష్టత్వం లేకుండా చేస్తాము.” కాని బెన్యామీనీయులు తమ తోటి ఇశ్రాయేలీయుల మాట వినలేదు.
14
ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి, బెన్యామీనీయులు తమ పట్టణాల నుండి గిబియా దగ్గరకు కలిసి వచ్చారు.
15
ఆ రోజు గిబియాలో నివసిస్తున్న ఏడువందలమంది శూరులకు అధనంగా బెన్యామీనీయులు తమ పట్టణాల నుండి కత్తియుద్ధం చేయగలిగే ఇరవై ఆరు వేలమందిని పోగుచేసుకున్నారు.
16
వీరందరిలో ఎడమచేతి వాటంగల వారు ఏడువందలమంది ప్రత్యేకమైన వారున్నారు, ఒక్కొక్కరు వడిసెలలో రాయి పెట్టి, తల వెంట్రుకలనైనా గురి తప్పకుండా కొట్టగలరు.
17
బెన్యామీను వారు కాకుండా, ఇశ్రాయేలు వారు కత్తియుద్ధం చేయగలిగే, అనుభవజ్ఞులైన నాలుగు లక్షల మందిని పోగుచేసుకున్నారు.
Settings