Skip to content
న్యాయాధిపతులు 20:1-11

ఇశ్రాయేలు సమకూడి ఫిర్యాదు వినుట

న్యాయాధిపతులు 20:1-11
1
అప్పుడు ఇశ్రాయేలీయులందరు, దాను నుండి బెయేర్షేబ వరకు ఉన్నవారు, గిలాదు ప్రదేశంలో ఉన్నవారు, అంతా ఏకమై మిస్పా దగ్గర యెహోవా సన్నిధిలో సమావేశమయ్యారు.
2
ఇశ్రాయేలు గోత్రాలన్నిటి నాయకులు, నాలుగు లక్షలమంది ఆయుధాలు కలిగి దేవుని ప్రజల సమావేశానికి హాజరయ్యారు.
3
ఇశ్రాయేలీయులు మిస్పాకు వెళ్లారని బెన్యామీనీయులు విన్నారు. అప్పుడు ఇశ్రాయేలీయులు, “ఈ నీచమైన పని ఎలా జరిగిందో మాకు చెప్పండి” అన్నారు.
4
చంపబడిన స్త్రీ భర్తయైన లేవీయుడు మాట్లాడుతూ అన్నాడు, “నేను, నా ఉంపుడుగత్తె రాత్రి గడుపుదామని బెన్యామీనులోని గిబియాకు వచ్చాము.
5
రాత్రివేళ గిబియా నాయకులు నా వెంటపడి నన్ను చంపాలనుకొని ఇంటిని చుట్టుముట్టారు. వారు నా ఉంపుడుగత్తెను మానభంగం చేయగా ఆమె చనిపోయింది.
6
ఇశ్రాయేలులో ఇలాంటి దుర్మార్గం, అవమానకరమైన పనివారు చేశారు కాబట్టి నా ఉంపుడుగత్తెను తీసుకెళ్లి ఆమెను ముక్కలుగా చేసి ఒక్కొక్క ముక్కను ఇశ్రాయేలీయుల వారసత్వ ప్రాంతాలకు పంపాను.
7
ఇప్పుడు, ఇశ్రాయేలీయులైన మీరంతా మాట్లాడి ఏమి చేయాలని నిర్ణయించారో చెప్పండి” అన్నాడు.
8
అప్పుడు ప్రజలంతా ఏకమై లేచి, “మనలో ఎవ్వరూ తమ గుడారానికి గాని ఇళ్ళకు గాని తిరిగి వెళ్లరు.
9
అయితే గిబియాకు మనం చేసేది ఇది: చీట్లు వేసి దాని ప్రకారం మనం గిబియా మీద దాడి చేద్దాము.
10
ఆహారం తీసుకురావడానికి ఇశ్రాయేలు గోత్రాలన్నిటి నుండి వందమందికి పదిమందిని, వెయ్యిమందికి వందమందిని, పదివేలమందికి వెయ్యిమందిని ఎన్నుకుందాము. అప్పుడు సైన్యం బెన్యామీనులోని గెబాకు చేరుకుంటారు, ఇశ్రాయేలులో వారు చేసిన అవమానకరమైన పనిని బట్టి వారిని శిక్షిస్తారు” అని అన్నారు.
11
కాబట్టి ఇశ్రాయేలీయులందరు ఏకమై లేచి పట్టణానికి వ్యతిరేకంగా కూడుకున్నారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options