Skip to content
యోబు 21:27-34

స్నేహితుల తప్పుడు తర్కమును యోబు తిరస్కరించుట

యోబు 21:27-34
27
“మీరేమి ఆలోచిస్తున్నారో, నామీద ఏ కుట్రలు చేస్తున్నారో నాకు తెలుసు.
28
‘ఇప్పుడు గొప్పవారి గృహం ఎక్కడ, దుష్టులు నివసించిన గుడారాలు ఎక్కడ?’ అని మీరంటారు.
29
ప్రయాణం చేసేవారిని మీరు ఎప్పుడు అడగలేదా? వారు చెప్పినవాటిని మీరు గుర్తుపట్టలేదా?
30
అవేమంటే, విపత్తు దినం నుండి దుష్టులు వదిలి వేయబడతారు, ఉగ్రత దినం నుండి ఎలా తప్పించుకుంటారు?
31
వారి ముఖం మీదనే వారి ప్రవర్తన గురించి ఎవరు ఖండిస్తారు? వారు చేసిన వాటికి ఎవరు వారికి తిరిగి చెల్లిస్తారు?
32
వారు సమాధికి మోయబడతారు, వారి సమాధులపై నిఘా పెట్టబడుతుంది.
33
లోయలోని మట్టి వారికి తీపి; మనుష్యులంతా వారిని వెంబడిస్తారు, అలాగే లెక్కలేనంత జనసమూహం వారికి ముందుగా వెళ్తారు.
34
“కాబట్టి మీ అర్థంలేని మాటలతో నన్నెలా ఓదార్చగలరు? మీ సమాధానాలలో అబద్ధం తప్ప మరేమీ లేదు!”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options